విశాఖపట్నం ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ , డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సీఫెర్ట్ కేవలం…