టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సిరీస్‌లో కీలకమైన మూడో 20 ఇవాళ జరగనుంది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టీ20కి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ కెప్టెన్‌గా జట్టుని నడిపించనున్నాడు. సూర్య మరో సెంచరీ చేయడం గ్యారంటీ అంటున్నారు అభిమానులు. నేపియర్‌లో మూడో టీ 20 జరగనుంది. రెండో టీ 20లో 65 పరుగుల తేడాతో విజయం సాధించి భారత జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టీ 20లో టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతను 111 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 191 పరుగుల భారీ స్కోర్ చేసింది.