T20 World Cup: కోహ్లీ నీకో దండం.. అలా మాత్రం ఆడకు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కెరీర్లో అత్యుత్తమ ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది. మళ్లీ మునుపటి కోహ్లీ కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ భారత్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. కొన్ని నెలలుగా ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన కోహ్లీపై ఒక దశలో వేటు పడుతుందనే అంచనాలు సైతం వ్యక్తం అయ్యాయి. అలాంటి దశ నుంచి కోహ్లీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే స్థాయికి ఎదిగాడు. అయితే గురువారం నెదర్లాండ్స్‌తో భారత్ తన రెండో మ్యాచ్ ఆడబోతోంది.
Read Also: ICC Rankings: పాకిస్థాన్‌తో ఒక్క ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
Also Read
- FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
- Virat Kohli: "ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు".. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
- Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
- India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ - భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్‌కు వర్షం ముప్పు..
ఈ సందర్భంగా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ అదే ఆటతీరు రిపీట్ చేయాలని తాము మాత్రం కోరుకోవడం లేదని స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు. పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్ ఓ విధ్వంసం లాంటిదని అభివర్ణించాడు. కోహ్లీ శక్తి సామర్థ్యాలు, దూకుడుకు ఈ ఇన్నింగ్స్ నిదర్శనంగా నిలిచిందని చెప్పాడు. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో తాము గెలుస్తామని ఎలాంటి అంచనాలు లేవని.. అందుకే తాము ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతామని స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పాడు. అయితే గెలవడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడమే తమ చేతుల్లో ఉందన్నాడు. టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో ఆడటం వల్ల తమ జట్టుకు మంచి అనుభవం లభిస్తుందని, ఎందరో స్టార్ క్రికెటర్లతో ఆడటం తమ జట్టుకు మేలు చేస్తుందని స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు
తాజావార్తలు
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
-
Dhamaal 4 Trailer : దెయ్యాలు సముద్రపు దొంగలతో గోల్ మాల్… “ధమాల్ 4” ట్రైలర్ మామూలుగా లేదుగా
-
Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..