Mumbai Chief Selector Sensational Comments On Sarfaraz Khan: భారత జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశకు గురైన ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్షన్ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తానూ మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తనను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపిక చేస్తానని చెప్పి హ్యాండిచ్చాడని సర్ఫరాజ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా.. మాజీ క్రికెటర్లు, అభిమానులు ఈ యువ క్రికెటర్‌కు అండగా నిలిచారు. అయితే ముంబై మాజీ కెప్టెన్, ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ మిలింద్ రేగె మాత్రం సర్ఫరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాటర్‌గా సర్ఫరాజ్ పని పరుగులు చేయడం వరకేనని, జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అన్నది అతని చేతుల్లో లేని అంశమని చెప్పాడు.
Public Urination : గోడలపై మూత్రం పోయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
చేతుల్లో లేనిదాని గురించి మాట్లాడటం అనవసరమని, ఈ పిచ్చి వ్యాఖ్యలకు బదులు బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. “ఆటను మెరుగు పర్చుకుంటూ ఉండు. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముంబై ప్రస్తుత కోచ్ అమోల్ మజుందార్ కంటే సర్ఫరాజ్ గొప్ప బ్యాటర్ ఏం కాదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 11 వేల పరుగులు సాధించిన అమోల్‌కు ఒక్కసారి కూడా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. అప్పటికి టీమిండియాలో చోటు లేకపోవడంతో తనకు నిరాశే ఎదురైంది. అయినా తను ఆటను కొనసాగించాడు. అమోల్‌ను చూసి సర్ఫరాజ్ నేర్చుకోవాల్సి ఉంది. అయినా, అమోల్ నీ కోచ్‌గా ఉండగా.. మీ నాన్నతో ఏం పని? ఆయన నీకు కోచింగ్ ఇస్తున్నారని ఓ పత్రికలో చదివా! అసలు ఆ వ్యవహారం ఏంటి?” అని మిలింద్ అసహనం వ్యక్తం చేశాడు.
Road Accident: యువకుల కారు సరదా.. రోడ్డుపక్క నిలబడిన వ్యక్తి మృతి