Public Urination : చాలామందికి రోడ్డు పక్కన గోడ కనిపిస్తే చాలు తడిపేయాలనిపిస్తుంది. పక్కన టాయిలెట్లు ఉన్నా.. బహిరంగ మూత్ర విసర్జనకే మొగ్గు చూపుతారు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన అమలులో మాత్రం విఫలం అవుతూనే ఉన్నాయి. ‘ఇచ్చట మూత్రం పోయరాదు.. మూత్రం పోసిన వాడు గాడిద’ లాంటి వ్యాఖ్యాలు రాసినా.. అవి ఉన్న చోటే పోసేస్తుంటారు తుంటరులు. ఇకపై వీటిన్నింటికీ చెక్ పెట్టేందుకు పలు దేశాలు నడుం బిగించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో బహిరంగ మూత్ర విసర్జన ఒక సమస్యలా మారింది. పలు నగరాల్లో బహిరంగ మూత్ర విసర్జన వద్దంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఫలితం ఉండడంలేదు. ఈ నేపథ్యంలో, లండన్ లో అధికారులు వినూత్న కార్యాచరణ చేపడుతున్నారు.
Read Also: Used Car Sale : తక్కువ ధరలో, అన్ని పత్రాలతో పాత కారు వెంటనే కొనేయండి
సెంట్రల్ లండన్ లోని సోహో టౌన్ షిప్ లో దాదాపు 12 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు… అక్కడి గోడలపై ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని పూయాలని నిర్ణయించారు. ఈ ద్రవం పూసిన గోడలపై మూత్రం పోస్తే… అది తిరిగి మూత్రం పోసిన వారిపైనే చిందుతుంది. తద్వారా బహిరంగ మూత్ర విసర్జన బ్రేక్ పడుతుందన్నది అక్కడ అధికారుల ఆలోచన. ఈ ద్రవం పూసిన గోడల వద్ద ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ ద్రవం ఒక పెయింట్ వంటి పదార్థమని, చాలా ప్రభావవంతమైన పనితీరు కనబరుస్తోందని స్థానిక కౌన్సిలర్ వెల్లడించారు. అంతేకాదు, ఆయన ఆ ద్రవం పనితీరును అందరికీ ప్రదర్శించి చూపించారు. ద్రవం పూసిన గోడపై కొన్ని నీళ్లు పోయగా, ఆ నీళ్లు వెంటనే వెనక్కి చిమ్మాయి.