టీం ఇండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారి ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయబడలేదు. దాంతో బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీసీసీఐ విహారిని భారత ఏ జట్టులో చేర్చింది. అక్కడ సౌత్ ఆఫ్రికా ఏ జట్టుపై ఆడిన విహారి మంచి ప్రదర్శన చేసాడు. దాంతో ఈ నెలలో టెస్ట్ సిటీస్ కోసం అక్కడికి వెళ్లనున్న భారత జట్టులో విహారిని కూడా ఉంచింది బీసీసీఐ. అయితే జట్టుకులో ఉన్న విహారి ప్లేయింగ్ ఎలెవన్ లో స్థానం దక్కించుకోవడం అనుమానమేనని భారత మాజీ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు.
అయితే విహారి స్థానంలో కివీస్ సిరీస్ కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ బాగా రాణించాడు. కాబట్టి అతనితో పాటుగా మిడిల్ ఆర్డర్ కు పోటీలో ఓపెనర్ అయిన మయాంక్ ఆగర్వాల్ కూడా ఉంటాడు అని ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. అయితే ఐపీఎల్ ముందు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా జట్టులో ఉన్న విహారికి ఆడే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు అతను ముందే భారత ఏ జట్టుతో సౌత్ ఆఫ్రికా వెళ్లి అక్కడ ఆడటం అతనికి మేలు చేస్తుందనిజట్టు కూర్పే అతను ఆడుతాడా.. లేదా అనేది నిర్ణయిస్తుంది అని ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్నారు.