MS Dhoni: సేఫ్ గేమ్ ఆడిన ధోనీ.. సంబంధం లేదంటూ చేతులెత్తేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Shocking Response On T20 World Cup: తాము జట్టులో ఉన్నా, లేకున్నా.. మెగా టోర్నీల సమయంలో భారత జట్టు ఎలా ప్రదర్శిస్తుందన్న విషయాలపై ఆటగాళ్లు తమతమ అభిప్రాయాలు, అంచనాలు వెల్లడిస్తుంటారు. మాజీలైతే.. టీమిండియాకు ఉపయోగపడే కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. ఎవరెవరు జట్టులో ఉంటే బాగుంటుంది? ఆయా పరిస్థితులు, పిచ్‌లకు అనుగుణంగా ఎలా ఆడాలి? అనే విషయాలపై తమదైన టిప్స్ ఇస్తారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కూడా అలాంటి సలహా – సూచనలేమైనా ఇస్తాడేమోనని ఆశించడంలో తప్పు లేదు. ఎందుకంటే, ఇతని సారథ్యంలో భారత్ రెండు వరల్డ్‌కప్స్ (వన్డే, టీ20) సాధించింది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లోనూ అతడు భారత్‌కి మెంటార్‌గా వ్యవహరించాడు. అందుకే, ఈసారి భారత్ వరల్డ్‌కప్‌లో రాణిస్తుందా? లేదా? అనే సందేహాలపై అతని అభిప్రాయం ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో హోస్ట్.. వరల్డ్‌కప్‌కు సంబంధించి ఒక ప్రశ్నను ఎంఎస్ ధోనీకి సంధించాడు. ‘‘మహీ, ఇప్పుడు వరల్డ్‌కప్‌కి భారత్ చాలా సమీపంలో ఉంది. ఇలాంటి సమయంలో క్రికెట్‌కి సంబంధించి ఓ ప్రశ్న అడగకపోతే, అభిమానులు నన్ను తిట్టేసుకుంటారు (సరదాగా)’’ అంటూ ప్రశ్నించాడు. దీనికి ధోనీ నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ రిప్లై వస్తుందేమోనని అంతా అనుకున్నారు. కానీ, అందరి అంచనాల్ని బోల్తా కొట్టిస్తూ.. అతడు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘‘ప్రస్తుతం నేను ప్రపంచకప్ ఆడటం లేదు. ఇప్పటికే టీమ్ఇండియా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. తనకున్న అనుభవం దృష్ట్యా భారత్ గెలుస్తుందో లేదోనని ధోనీ చెప్తాడని ఆశిస్తే.. అసలు తనకు సంబంధం లేదన్నట్టుగా సేఫ్ ఆన్సర్ ఇచ్చి ధోనీ తప్పుకున్నాడు. ఇది అభిమానుల్ని కాస్త నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
"Iam not playing the world cup". – MS Dhoni in recent interview !! 🥺#MSDhoni © : @mahakshi4710 pic.twitter.com/3O2ZGtxVbZ
— Nithish MSDian 🦁 (@thebrainofmsd) October 20, 2022
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!