భారత్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్, ఫాలోయింగ్ గడించిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే.. అది మహేంద్రసింగ్ ధోనీనే! టీమిండియాకు అతడు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాడు. అతని సారథ్యంలోనే 28 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ గెలిచింది. తొలి టీ20 వరల్డ్‌కప్‌ని కూడా కైవసం చేసుకుంది. కెప్టెన్ కూల్‌గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. అందుకే.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ ఇతని ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు 7వ తేదీన ధోనీ బర్త్‌డే వస్తుండడంతో.. ఆ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.
కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్.. స్పోర్ట్స్ మ్యాగజైన్స్, స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ధోనీ పుట్టినరోజుని భారీఎత్తున ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే.. స్పోర్ట్స్ తెలుగు ఛానల్ మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ధోనీ ఫేస్‌తో మార్ఫ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టర్‌కి ‘కెప్టెన్ కూల్’ అనే టైటిల్ పెట్టి, సెలెబ్రేటింగ్ ఎమ్ఎస్‌డీ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టింది. ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘‘నో క్లాస్ – నో మాస్.. ఓన్లీ కూల్ వన్ అండ్ ఓన్లీ తలా’’ అంటూ ట్వీట్ చేసింది. రీసెంట్‌గానే వచ్చిన గాడ్‌ఫాదర్ పోస్టర్‌ను మార్ఫ్ చేయడం, అది కనులవిందుగా ఉండడంతో.. అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ ఫోటోని పెద్దఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అంతేకాదు.. జెర్సీ నం. 7 కథతో ధోనీ తన కెరీర్‌లో భారత్‌కి అందించిన హిస్టారిక్ మూమెంట్స్‌ని ప్రసారం చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ సన్నద్ధమవుతోంది. ఉదయం 9 గంటలకు ఓసారి, అలాగే రాత్రి 10:30 గంటలకు టెలికాస్ట్ చేయబోతోంది. ఈ సందర్భంగా వరుస ట్వీట్లతో ధోనీ అభిమానుల్లో ఉత్తేజం నింపుతోంది. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్స్‌లో కలిపి అత్యధిక మ్యాచుల్లో కెప్టెన్సీ రికార్డ్ కైవసం చేసుకున్న ధోనీ గురించి ఆసక్తికరమైన కంటెస్ట్‌లు కూడా నిర్వహిస్తోంది.
నో క్లాస్ – నో మాస్ 🥳
ఓన్లీ కూల్ 😎వన్ అండ్ ఓన్లీ తలా 🤩@msdhoni 😉#StarSportsTelugu #MSDhoni #CelebratingMSD #Maahi #Chiranjeevi pic.twitter.com/tr4Y0dx78V
— StarSportsTelugu (@StarSportsTel) July 4, 2022