Most Wides and No-Balls: టీ20ల్లో అత్యధిక వైడ్లు, నోబాల్స్ లిస్ట్.. టాప్‌లో అర్షదీప్, బుమ్రా ప్లేస్ ఎక్కడుందో తెలుసా?
- టీ20 ఫార్మాట్లో ప్రతి బంతి కీలకమే
- వైడ్ లేదా నోబాల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది
- టీ20ల్లో అత్యధిక వైడ్లు, నోబాల్స్ వేసింది ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Wides & No-Balls for India in T20Is: టీ20 ఫార్మాట్లో బౌలర్ వేసే ప్రతి బంతి కీలకమే. ఒక వైడ్ లేదా నోబాల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తాయి. వైడ్ లేదా నోబాల్ కారణంగా మ్యాచ్ ఓడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. స్టార్ బౌలర్లు కూడా ఏదో ఓ సందర్భంలో వైడ్ లేదా నోబాల్ వేస్తుంటారు. ఆ లిస్టులో భారత అటగాళ్లు చాలా మందే ఉన్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో భారత జట్టు తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వైడ్లు, నోబాల్స్ వేసిన బౌలర్ల జాబితా ఆసక్తికరంగా ఉంది.
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వైడ్లు, నోబాల్స్ వేసిన జాబితాలో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 119 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. ఇందులో 102 వైడ్లు ఉండగా.. 17 నోబాల్స్ ఉన్నాయి. డెత్ ఓవర్లలో ఎక్కువగా బౌలింగ్ చేయడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా నమోదైనట్టు క్రికెట్ నిపుణులు అంటున్నారు. రెండో స్థానంలో హార్దిక్ పాండ్య ఉన్నాడు. హార్దిక్ మొత్తంగా 114 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. అందులో 110 వైడ్లు, 4 నోబాల్స్ ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా కీలక సమయాల్లో బంతి పట్టడం వల్ల ఒత్తిడిలో ఈ ఎక్స్‌ట్రాలు వచ్చాయి.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- IND Vs ENG: తిలక్ వర్మ మెరుపులు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్..
- Tilak Varma: తిలక్ వర్మ అవుటా..? నాటవుటా..? పెవిలియన్ వైపు వెళ్లిన తిలక్ వర్మ మళ్లీ బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడు..?
Also Read: AP Legislative Council: నేటి నుంచి శాసనమండలి సమావేశాలు.. లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్!
మూడో స్థానంలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అతను మొత్తం 76 వైడ్లు వేశాడు. స్వింగ్ బౌలింగ్‌లో నైపుణ్యం కలిగిన భువీ కొన్ని సందర్భాల్లో లైన్ తప్పడంతో ఈ సంఖ్య పెరిగింది. నాలుగో స్థానంలో మాజీ స్పిన్నర్ రవి అశ్విన్ ఉన్నాడు. యాష్ 55 వైడ్లు, 4 నోబాల్స్ కలిపి 59 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. స్పిన్నర్ అయినప్పటికీ కీలక మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ ఈ గణాంకాలు నమోదు చేశాడు. ఐదో స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. 45 వైడ్లు, 11 నోబాల్స్‌తో మొత్తం 56 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. యార్కర్లు వేయడంలో నైపుణ్యం ఉన్న బుమ్రా కొన్నిసార్లు నోబాల్స్ రూపంలో అదనపు పరుగులు ఇచ్చాడు.
మణికట్టు సిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 56 ఎక్స్‌ట్రాలతో ఈ జాబితాలో చోటు సంపాదించాడు. యూజీ 51 వైడ్లు, 5 నోబాల్స్ వేశాడు. మధ్య ఓవర్లలో వికెట్లు తీసే క్రమంలో రిస్క్ తీసుకోవడం వల్ల వైడ్లు వచ్చాయి. టీ20ల్లో బౌలర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గణాంకాలు వారి ప్రతిభను ఏమాత్రం తగ్గించవు. మ్యాచ్‌లను గెలిపించిన ఎన్నో అద్భుత ప్రదర్శనలు కూడా వీరి ఖాతాలోనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో వైడ్లు, నోబాల్స్ వేయడం సాధారణమే.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్‌లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!