Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Mohammed Siraj Confident Ahead Of South Africa Test Series Says Hes In Great Form

Mohammed Siraj: మంచి ఫామ్‌లోనే ఉన్నా.. సిరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published Date :November 12, 2025 , 7:21 am
By Sampath Kumar
  • దక్షిణాఫ్రికాతో సిరీస్‌ టీమిండియాకు కీలకం
  • ఈడెన్‌ గార్డెన్స్‌లో శుక్రవారం తొలి టెస్టు ఆరంభం
  • దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సత్తాచాటుతా
Mohammed Siraj: మంచి ఫామ్‌లోనే ఉన్నా.. సిరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వ్యక్తిగతంగా తాను మంచి ఫామ్‌లో ఉన్నా అని హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ తెలిపాడు. బలమైన జట్లతో ఆడడం వల్ల ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలో తెలుస్తుందని.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2025-27 నేపథ్యంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దక్షిణాఫ్రికాతో సిరీస్‌ టీమిండియాకు ఎంతో కీలకమని సిరాజ్‌ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో శుక్రవారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సందర్భంగా భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్‌ చేసింది.

‘డబ్ల్యూటీసీ 2025-27లో దక్షిణాఫ్రికాతో ఆడనున్న రెండు టెస్టులు టీమిండియాకు కీలకం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ప్రొటీస్ ఇటీవల పాకిస్థాన్‌ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. టెస్ట్ సిరీస్‌పై మేం మంచి విశ్వాసంతో ఉన్నాం. భారత జట్టు ఫామ్‌లో ఉంది. ప్లేయర్స్ అందరూ బాగా ఆడుతున్నారు.ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించాం. స్వదేశంలో వెస్టిండీస్‌పై సత్తాచాటాము. దక్షిణాఫ్రికాపై కూడా విజయం సాధిస్తామని భావిస్తున్నా. ఇక వ్యక్తిగతంగా మంచి ఫామ్‌లో ఉన్నా. దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లతో ఆడడం వల్ల ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది. టెస్ట్ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మహ్మద్‌ సిరాజ్‌ చెప్పాడు.

Also Read: Peddi : మొత్తానికి ఆ లోటు తీర్చేసిన రామ్ చరణ్‌

మహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్ ద్వారా భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీంఇండియాలో ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా తర్వాత సిరాజ్‌పైనే భారత్ ఆధారపడుతోంది. బుమ్రా లేని సమయాల్లో బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. 31 ఏళ్ల సిరాజ్‌ ఇప్పటివరకు భారత్ తరఫున 43 టెస్టుల్లో 133 వికెట్స్ పడగొట్టాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 6/15. ఇటీవలి విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ పది వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో 23 వికెట్లు పడగొట్టాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs sa
  • IND vs SA 1st Test
  • Mohammed Siraj
  • South Africa vs India
  • South Africa vs India Test Series 2025

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions