వ్యక్తిగతంగా తాను మంచి ఫామ్‌లో ఉన్నా అని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. బలమైన జట్లతో ఆడడం వల్ల ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలో తెలుస్తుందని.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకమని సిరాజ్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం తొలి టెస్టు ఆరంభం కానుంది.…