Mitchell Starc: భారత్‌ను చూసి అన్ని జట్లు సుస్సు పోసుకుంటున్నాయి.. స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- భారత్‌ను చూసి అన్ని జట్లు సుస్సు పోసుకుంటున్నాయి
- భారత్ అద్భుతంగా ఆడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mitchell Starc Said India Dominating World Cricket: భారత జట్టుపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందన్నాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌పై పూర్తి ఆధిపత్యం చూపింది ఆస్ట్రేలియా టీమ్ అని, అప్పట్లో ప్రత్యర్థి జట్లు ఆసీస్‌ను ఎదుర్కొనేందుకు భయపడేవని గుర్తు చేశాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ఇప్పుడు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్న జట్టు భారత్ అని స్టార్క్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన విజయాలపై స్టార్క్ స్పదించాడు.
టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ… ‘భారత్ అద్భుతంగా ఆడుతోంది. గతంలో ఆస్ట్రేలియా జట్టును చూసి ప్రత్యర్థులు ఒత్తిడికి లోనయ్యేవారు. కానీ ఇప్పుడు టీమిండియాను చూసి మిగతా టీమ్స్ భయపడుతున్నాయి. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో భారత్‌ను ఎదుర్కోవడం చాలా జట్లకు పెద్ద సవాలుగా మారింది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమతుల్యతతో ఉంది. అంతేకాదు బెంచ్ స్ట్రెంగ్త్ కూడా ఉండటం వల్లే ఈ స్థాయి ఆధిపత్యం సాధ్యమైంది’ అని అభిప్రాయపడ్డాడు.
Also Read
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
- KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
Also Read: IND vs PAK: వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో హైయెస్ట్ స్కోర్.. పాకిస్థాన్ బ్యాటర్ల హవా, కోహ్లీ మాత్రం..!
ప్రస్తుతం భారత జట్టు యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లతో బలంగా ఉంది. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకుని విజయాలు సాధించే సామర్థ్యం పెరగడం కూడా జట్టు విజయ రహస్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మద్దతు, బలమైన దేశీయ క్రికెట్ వ్యవస్థ కూడా టీమిండియా ఎదుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన ఆస్ట్రేలియా స్థానాన్ని ఇప్పుడు భారత్ ఆక్రమించిందని మిచెల్ స్టార్క్ వ్యాఖ్యలు చేయడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇవి భారత జట్టు ప్రస్తుత ఫామ్, స్థిరత్వానికి నిదర్శనంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?