Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whale Graveyard : హిందూ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, లోతైన ‘తిమింగలాల శ్మశానాన్ని’ (Whale Graveyard) కనుగొన్నారు. ‘డైమంటినా ఫ్రాక్చర్ జోన్’ (Diamantina Fracture Zone) లో సముద్ర మట్టానికి దాదాపు 7 కిలోమీటర్ల లోతులో, 1,200 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించి ఉంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ‘ఫెండౌఝే’ (Fendouzhe) అనే సబ్మెర్సిబుల్ ద్వారా ఇక్కడ దాదాపు కోటి (10 మిలియన్లు) కి పైగా తిమింగలాల అస్థిపంజరాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఇందులో 53 లక్షల సంవత్సరాల క్రితం నాటి పురాతన శిలాజాలతో పాటు, ‘స్టెరోసెటస్ డైమంటినే’ అనే అంతరించిపోయిన అరుదైన తిమింగలం జాతి ఎముకలను కూడా గుర్తించారు. ఈ జలాంతర్గామి 2023 సంవత్సరమంతా మొత్తం 32 లోతైన డైవ్లను నిర్వహించింది. వాటి ఫలితాలను ఇప్పుడు బయట ప్రపంచంతో పంచుకున్నారు శాస్త్రవేత్తలు.
ఈ ప్రాంతంలోనే ఇన్ని తిమింగలాలు అస్థిపంజరాలు పేరుకుపోవడాన్ని చూసి సైంటిస్ట్ లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సముద్ర భాగం ఒకప్పుడు తిమింగలాలకు ప్రధాన ఆహార కేంద్రంగా ఉండటంతో ఇక్కడ వాటి సంచారం ఎక్కువగా ఉండేది. చనిపోయిన తిమింగలాల శరీరాలను ఇక్కడి ‘V’ ఆకారపు లోయలు ఒక సర్కిల్ లాక్కుంటూ ఒకే చోటికి చేర్చాయి. అంతటి లోతులో మట్టి పేరుకుపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉండటం, అలాగే సముద్రపు నీటిలోని రసాయనాలు ఎముకలపై ఒక రక్షణ పొరలా ఏర్పడటం వల్ల.. ఇవి కుళ్ళిపోకుండా మిలియన్ల సంవత్సరాల పాటు భద్రంగా ఉన్నాయి.
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
అయితే ఈ వింత శ్మశానం కేవలం ఎముకల కుప్పగా మిగిలిపోకుండా, సముద్ర గర్భంలోని జీవకోటికి జీవనాధారంగా (Whale Falls) మారింది. చనిపోయిన తిమింగలాల శరీరాల నుండి విడుదలయ్యే భారీ పోషకాల వల్ల.. అక్కడ ఎముకలను తినే పురుగులు, అరుదైన జెల్లీఫిష్‌లు, స్టార్ ఫిష్‌లు వంటి సైన్స్‌కు కొత్తగా తెలిసిన వింత జీవులు జీవిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మిలియన్ల కొద్దీ తిమింగలాల అస్థిపంజరాలు దాదాపు 67 లక్షల టన్నుల కార్బన్‌ను సముద్ర గర్భంలోనే బంధించి ఉంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతకు కూడా ఎంతో సహాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?