Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News : ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా సంచలనాలు ఒకే కథలో కలిసిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో వ్యవహారం అలానే ఉంది. వీళ్ళ రొమాంటిక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవైపు ప్రపంచ పాప్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన పాప్ స్టార్ కేటీ పెర్రీ, మరోవైపు కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో. ఈ ఇద్దరూ కలిసి కనిపించిన ప్రతి సందర్భం ఇప్పుడు అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడుతోంది. ఈ కథ వెనుక అసలు నిజం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. పసిఫిక్ మహాసముద్రం అందాలు కనిపించే ఒక ఎత్తైన పార్క్ ప్రాంతంలో కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, సన్నిహితంగా గడుపుతున్న దృశ్యాలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత వీరి మధ్య ఉన్న బంధంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే వీరిద్దరి పేర్లు కలిసి వినిపించడం ఇదే మొదటిసారి కాదు.
Also Read
- Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
సరిగ్గా ఏడాది క్రితం కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ ‘లే వియోలన్’లో వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ మీడియా కంటపడ్డారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తరువాత కాలంలో కూడా వివిధ సందర్భాల్లో వీరు కలిసి కనిపించడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇటీవల న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో కేటీ పెర్రీ కన్సర్ట్ డాక్యుమెంటరీ ‘Katy Perry: The Lifetimes Tour – Live From Paris’ ప్రీమియర్ సందర్భంగా వీరిద్దరూ చేతులు పట్టుకుని రెడ్ కార్పెట్‌పై నడవడం పెద్ద చర్చకు దారితీసింది. అంతకుముందు లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకల్లో కేటీ పెర్రీ వేదికపై ప్రదర్శన ఇస్తుండగా, ట్రూడో ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆమెను ప్రోత్సహించడం కూడా మీడియాలో పెద్ద చర్చే నడిచింది.
🥰 Katy Perry and Justin Trudeau make out in Santa Barbara.
Credit: BACKGRID pic.twitter.com/pFZOTGafNv
— TMZ (@TMZ) June 15, 2026
అయితే ఈ కథను కేవలం ప్రేమ కథగా మాత్రమే చూడలేమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత తన గ్లోబల్ ఇమేజ్ను కొత్తగా నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేటీ పెర్రీ తన కొత్త ఆల్బమ్‌తో పాటు ‘The Lifetimes Tour’ డాక్యుమెంటరీకి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం దక్కేలా చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ వ్యవహారం వ్యక్తిగత సంబంధమా లేక ఇద్దరి బ్రాండ్ విలువలను పెంచే వ్యూహాత్మక పబ్లిసిటీ చర్యా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచ మీడియా చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. నిజం ఏదైనా కావచ్చు. కానీ కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో జంట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న విషయం మాత్రం వాస్తవం.
- Tags
- #ViralVideo
- KatyPerry
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!