ఐపీఎల్ ద్వారా మరో యువ కెరటం వెలుగులోకి వచ్చింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా లక్నో ఆటగాడు ఆయుష్ బదోనీ తన సత్తా చూపించాడు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అతడు రికార్డు సృష్టించాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఆయుష్ బదోనీ మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా 41 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో ఆయుష్ బదోనీ 54 పరుగులు చేశాడు. దీపక్ హుడాతో కలిసి అతడు పోరాడటంతో లక్నో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ బదోనీ తన వీరోచిత ఇన్సింగ్స్‌తో యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. బదోనీని మెగా వేలంలో లక్నో టీమ్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20లలో బదోనీ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. కాగా లక్నో కోచ్ గంభీర్ ప్రోత్సాహం వల్లే తాను రాణించానని ఆయుష్ బదోనీ చెప్తున్నాడు.