ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7.30 గంటలకు లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. లక్నో సూపర్ జెయింట్స్ కు ఇది మూడో మ్యాచ్ కాగా సన్ రైజర్స్ కు రెండోది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు మ్యాచ్ లో ఓటమిని చవి చూసినవే. తాను ఆడిన రెండో మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. సన్ రైజర్స్ కూడా తన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో మట్టికరిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో సన్ రైజర్స్ జట్టు నిలిచింది. గత సీజన్ తరహాలోనే ఇప్పుడు కూడా తన వైఫల్యాలను కొనసాగిస్తోంది.. అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
Also Read : Kunamneni Sambasiva Rao: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తాం…
ఈ మ్యాచ్ లో గెలిస్తే కాస్తయినా అభిమానుల్లో ఆనందం వస్తోంది. లేదంటే ఈ నెగిటివ్ నెస్ కంటిన్యూ అవుతుందనడంలో సందేహా అవసరం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థిత్తుల్లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఆ జట్టు హోమ్ పిచ్ మీద ఢీ కొట్టబోతుంది. ఇవాళ్టీ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఉత్కంఠంగా మారింది. ఈ పరిణామాల మధ్య దక్కన ఛార్జెర్స్ లోగో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Once upon a time there lived a Ghost అనే క్యాప్షన్ తో ఇది వైరల్ అవుతుంది. కమల్ హాసన్ కమ్ బ్యాక్ మూవీ విక్రమ్ థిమ్ సాంగ్ ను అటాచ్ చేసి విడుదల చేశారు.
Also Read : Panipuri : ఏంటో ఈ ఆడవాళ్లు.. పానీ పూరి తిననంటే కొట్టి చంపేస్తారా?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కన్ ఛార్జర్స్ నుంచి స్పూర్తిని పొందాల్సిన అవసరం ఉందని సజెస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్ ఆరంభమైన రెండో సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన దక్కన్ ఛార్జర్స్. ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు పరుగుల తేడాతో ఓడించింది. అప్పటి జట్టుకు ఆడమ్ గిల్ క్రిస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్కన్ ఛార్జర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసినప్పటికీ. దాన్ని కాపాడుకోగలిగింది. 53 పరుగులు చేసిన ఓపెనర్ హెర్ష్ లె గిబ్స్ టాప్ స్కోరర్. తిరుమలశెట్టి సుమన్-10, ఆండ్రూ సిమండ్స్-33, రోహిత్ శర్మ-24 పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టులో అనిల్ కుంబ్లే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ దక్కన్ ఛార్జర్స్ బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. ఓఝా-3, సిమండ్స్-2, హర్మీత్ సింగ్-2, ర్యాన్ హ్యారిస్-, ఆర్పీ సింగ్-1 వికెట్ తీసుకున్నారు.
Also Read : Bandi sanjay: ‘బండి’ అత్తగారింట్లో ‘బలగం’ సీన్ రిపీట్
దక్కన్ ఛార్జర్స్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచింది. వాండెర్ మెర్వ్ 32 పరుగులు చేశాడు. అతనొక్కడే టాప్ స్కోరర్.. రాస్ టేలర్-27, జాక్వెస్ కల్లిస్-15, రాబిన్ ఉతప్ప-17 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ భారీ స్కోర్ సాధించలేకపోయారు.
