Kolkata Knight Riders Announced Nitish Rana As Captain: గాయం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కి దూరమైన సంగతి తెలిసిందే! దీంతో.. అతని స్థానంలో కెప్టెన్‌గా కేకేఆర్ యాజమాన్యం ఎవరిని ఎంపిక చేస్తుందా? అనే ప్రశ్న కొన్ని రోజుల నుంచి మిస్టరీగా మారింది. సాధారణంగా.. ట్రాక్ రికార్డ్ బాగుండటంతో పాటు కాస్త అనుభవం ఉన్న వారినే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా నియమించడం జరుగుతుంది. విదేశీ ఆటగాళ్ల విషయంలోనూ అదే లెక్కలు వేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సునీల్ నరైన్, టిమ్ సౌథీ, రసెల్, శార్దూల్ ఠాకూర్ పేర్లు తెరమీదకి వచ్చాయి. వీరిలో సునీల్ నరైన్ పైరేతే బాగా చక్కర్లు కొట్టింది. అతడు జట్టులో చాలా సీనియర్ ఆటగాడు కావడం, యూఏఈ ఈవెంట్‌లోనూ జట్టుకి కెప్టెన్‌గా వహించడంతో.. అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేయొచ్చని అందరూ దాదాపుగా ఫిక్స్ అయ్యారు.
Shikhar Dhawan: రాజకీయాల్లోకి వస్తా.. గబ్బర్ షాకింగ్ స్టేట్‌మెంట్
కానీ.. కేకేఆర్ మేనేజ్‌మెంట్ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ సరికొత్త పేరుని సెలెక్ట్ చేసింది. ఇంతకీ అది ఎవరు? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. సీనియర్ ఆటగాడు నితీశ్ రానా. ప్రస్తుతం వెన్ను నొప్పితో దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా నితీశ్‌ని నియమించినట్టు కేకేఆర్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. 2018 నుంచి నితీశ్ కేకేఆర్‌లోనే కొనసాగుతున్నాడు. దీనికితోడు.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతనికి ఢిల్లీ కెప్టెన్‌గా అనుభవం కూడా ఉంది. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకొని.. నితీశ్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ బృందం నితీశ్‌కు సహరిస్తుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నితీశ్ ఆల్ ద బెస్ట్ చెప్పిన కేకేఆర్ మేనేజ్‌మెంట్.. శ్రేయస్ అయ్యర్ త్వరగా గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించింది.
Minister KTR: నాలుగేళ్లలో ఏం చేశావ్.. బండి సంజయ్‌పై కేటీఆర్ ధ్వజం
కాగా.. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రానా, ఇప్పటివరకూ 91 మ్యాచ్‌లు ఆడి 2181 పరుగులు సాధించాడు. ఇందులో 15 అర్థశతకాలు ఉన్నాయి. 2016 నుంచి 2018 వరకు ఇతడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇక 2018 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఆడుతున్నాడు. గత వేలంలో కేకేఆర్ జట్టు రానాను రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పుడు అతనికి కెప్టెన్‌గా బంపరాఫర్ వచ్చింది కాబట్టి, దీనిని సద్వినియోగం చేసుకుంటే అది భవిష్యత్ మలుపు తిరిగడం ఖాయం. మరి, ఈ తాత్కాలిక ఆఫర్‌ని రానా ఎలా మలచుకుంటాడో చూడాలి.