KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు అద్భుతం.. విజయ శాతం తెలిస్తే మైండ్ బ్లాకే!
- దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్
- భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం
- గతంలో మూడు ఫార్మాట్లలో సారథిగా రాహుల్
- రాహుల్ కెప్టెన్సీ రికార్డు అద్భుతం
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాహుల్ టీమిండియాను నడిపించనున్నాడు. మెడ నొప్పితో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ స్థానంలో రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. రాహుల్ గతంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు ఫార్మాట్లలో సారథిగా చేశాడు. మరోసారి కెప్టెన్సీని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.
కేఎల్ రాహుల్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు కానీ.. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టును నడిపించాడు. ఈ సీనియర్ ఆటగాడు గత కొన్ని సంవత్సరాలుగా వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్సీ ఇచ్చినప్పుడల్లా విజయవంతమయ్యాడు. ఆటగాడిగా కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. రాహుల్ నాయకత్వ రికార్డును ఓసారి చూద్దాం. రాహుల్ ఇప్పటివరకు మొత్తం 12 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులో ఎనిమిది వన్డేల్లో గెలిచిన భారత్.. నాలుగు ఓడిపోయింది. రాహుల్ విజయ శాతం 66గా ఉంది.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
Also Read: Smriti Mandhana-Palak: షాకింగ్ న్యూస్.. స్మృతి మంధానని మోసం చేసిన పలాశ్, స్క్రీన్షాట్లు వైరల్
మూడు టెస్ట్ మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. ఇందులో భారత్ రెండు గెలవగా, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒక టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. రాహుల్ తన కెప్టెన్సీలో 10 ఇన్నింగ్స్‌ల్లో 33.55 సగటుతో 302 పరుగులు చేశాడు. రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. ఆసక్తికరంగా భారత వన్డే కెప్టెన్‌గా అతని తొలి మ్యాచ్ 2022 పర్యటనలో దక్షిణాఫ్రికాపై ఆడాడు. రాహుల్ 88 వన్డేల్లో 48.31 సగటుతో 3092 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!