India vs South Africa Final ODI in Vizag: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి వన్డే మ్యాచ్ డిసెంబర్ 6వ తేదీ శనివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుంది. రాంచీలోని మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా…
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాహుల్ టీమిండియాను నడిపించనున్నాడు. మెడ నొప్పితో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ స్థానంలో రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. రాహుల్ గతంలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు ఫార్మాట్లలో సారథిగా చేశాడు. మరోసారి కెప్టెన్సీని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కేఎల్ రాహుల్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు కానీ..…