ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేయడం సరైన నిర్ణయమేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. తాజాగా ‘భారత్‌లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఆ పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపించింది. బయో బబుల్‌లో ఉంటూ ఆడటం చాలా బాగా అనిపించింది. టోర్నీ నిలిచిపోయేవరకు బబుల్లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కానీ అక్కడక్కడ ప్రోటోకాల్స్ బ్రేక్ అయ్యాయి. దాంతో టోర్నీ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల వాయిదా వేయ్యడమే మంచి నిర్ణయం. టోర్నీ ఆగిపోయాక మమ్మల్ని మాల్దీవ్స్ పంపడం, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకెళ్లడం సవాలే అయినప్పటికీ బీసీసీఐ, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పట్లు చేశాయి. మమ్మల్ని ఈజీగా గమ్యం చేర్చాయి.’అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.