Kane Williamson: కేన్ మామ గుడ్ బై!
- న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్..
- అంతర్జాతీయ టీ20లకు బిగ్ బై చెప్పిన కేన్ విలియమ్సన్..
- టీ20 వరల్డ్ కప్-2026 టోర్నీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా: కేన్ మామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. నేను తీసుకున్న ఈ నిర్ణయం జట్టుకు ఎంతో ముఖ్యమైంది.. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే మంచి సమయం.. వచ్చే టీ20 ప్రపంచ కప్ కి జట్టును రెడీ చేసే విషయంలో వారికి ఇప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది.. జట్టులో టీ20 ఆటగాళ్లకు కొదవలేదు.. వరల్డ్ కప్ టోర్నీకి వారిని ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇక, మిచెల్ సాంట్నర్ అద్భుతమైన కెప్టెన్.. జట్టుకు నా వంత సహకారం ఎప్పుడూ ఉంటుందని కేన్ విలియమ్సన్ వెల్లడించాడు.
Read Also: UP: వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు.. తలపై నుంచి దూసుకెళ్లిన వ్యాన్ (వీడియో)
Also Read
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
అయితే, వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందే కేన్ మామ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో విండీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమైయ్యాడు. ఇక, వెస్టిండీస్‌తో డిసెంబరులో జరుగబోయే 3 టెస్టులకు మాత్రం తాను అందుబాటులో ఉంటానని తెలియజేశాడు. విలియమ్సన్ టీ20లకు రిటైర్మెంట్ ఇవ్వడంపై న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ రియాక్ట్ అయ్యారు. కేన్ కెరీర్ అద్భుతంగా కొనసాగింది.. అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి తమ సపోర్టు ఉంటుందని వెల్లడించారు. ఏదేమైనా కేన్ చాలా ఏళ్లు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ, ఆటకు వీడ్కోలు పలికే విషయంలో అతడికి పూర్తి స్వేచ్ఛా ఉంటుందని చెప్పాడు. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజంగా కేన్ చరిత్రలో నిలిచిపోతాడని ప్రశంసించాడు.
Read Also: Star Hero : హిట్ కోసం ఆపసోపాలు పడుతున్న స్టార్ హీరో.. రంగంలోకి సీనియర్ దర్శకులు
ఇక, మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్లో కెప్టెన్ హోదాలో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు. ఆ తర్వాత టెస్టు, వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ వదులి పెట్టుకున్న కేన్ మామ.. కివీస్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్డు నుంచి కూడా తప్పుకున్నాడు. కుటుంబానికి సమయం కేటాయించడంతో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడే క్రమంలో క్యాజువల్ కాంట్రాక్టు కుదుర్చుకోవడం ద్వారా తనకు కుదిరినప్పుడు దేశం తరఫున ఆడుతున్నాడు.
కాగా, న్యూజిలాండ్ జట్టు తరఫున ఎన్నో రికార్డులు సాధించిన కేన్ విలియమ్సన్.. అంతర్జాతీయ టీ20లలో 93 మ్యాచ్‌లు ఆడి.. 2575 రన్స్ సాధించాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉండగా.. 2021 టీ20 వరల్డ్ కప్ లో కివీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్.. ఆస్ట్రేలియాతో ఫైనల్లో 85 రన్స్ చేశాడు. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. 2016, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లోనూ కేన్ న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహారించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో క్రికెట్ లో కివీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితాలో కేన్ మామ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, 2011లో న్యూజిలాండ్ తరఫున టీ20లలో కేన్ విలియమ్సన్ అరంగేట్రం చేశాడు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!