Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద ఝలక్.. ఆ విధ్వంసకర ఓపెనర్ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joss Butler To Miss Upcoming Game Against Delhi Capitals: నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్ రాయల్స్‌కు ఆ బాధ నుంచి కోలుకోకముందే ఒక పెద్ద ఝలక్ తగిలింది. ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు.. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జాస్ బట్లర్ దూరం కానున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బట్లర్ చేతి వేలుకు గాయమైంది. ఈ గాయం కారణంగానే అతడు ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌కి రాలేదు. అతని స్థానంలో అశ్విన్ వచ్చాడు. అయితే.. వెంటనే తొలి వికెట్ పడటంతో బట్లర్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు.
Akshara Singh: హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. సిగ్గు లేదా ఇలాంటివి చేయడానికి
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బట్లర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించాడు. అప్పటికీ భారీ షాట్‌లు బాదేందుకు ప్రయత్నించాడు. 19 పరుగులు చేయగలిగాడు. అయితే.. ఆ గాయం తీవ్రమైతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి, తదుపరి మ్యాచ్‌లో బట్లర్‌కు విశ్రాంతి ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్టు తెలిసింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలోనూ.. బట్లర్ పూర్తిగా ఫిట్‌గా లేడని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా తెలిపాడు. దీన్ని బట్టి.. ఆ గాయం తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనికి విశ్రాంతి ఇవ్వడమే సరైన నిర్ణయమని జట్టు యాజమాన్యం భావించింది. బట్లర్ స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ డోనవాన్ ఫెరీరాను జట్టులో తీసుకోనున్నారని సమాచారం.
Shikhar Dhawan: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86) అర్థశతకాలతో చెలరేగిపోవడంతో పంజాబ్ కింగ్స్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ సంజూ (42), హెట్‌మేయర్, జురేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించారు కానీ, చివరికి వారి ప్రయత్నం విఫలమైంది.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు