కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఈ నెల 19 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సెకండ్ హాఫ్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలింది. జట్టులో ముఖ్యమైన ఆటగాడు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో మిగిలిన ఐపీఎల్ కు దురమయ్యడు. అయితే ఎన్ని రోజులు భారత జట్టుతో 5 టెస్టుల సిరీస్ లో ఆడిన బెయిర్‌స్టో ఐపీఎల్ కు దూరం కావడానికి కరోనా నిబంధనలే కారణం అని తెలుస్తుంది. ఇంగ్లాండ్ నుంచి యూఏఈకి ఐపీఎల్ కోసం వచ్చే భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు తప్పకుండ 6 రోజులు క్వారంటైన్ లో ఉండాలి అని బీసీసీఐ పేర్కొంది. ఆ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుండి బెయిర్‌స్టో తప్పనుకున్నాడు. అయితే ఐపీఎల్ మొదటి ఏడు మ్యాచ్ లు ఆడిన బెయిర్‌స్టో 141 స్ట్రైక్ రేట్ తో మొత్తం 248 పరుగులు సాధించాడు.