Ishan kishan: ICC ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్-10లో స్థానం..

  • ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ దూకుడు..
  • టీ20 ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో డాషింగ్ బ్యాటర్..
  • టాప్-10లో నలుగురు ఇండియన్ ప్లేయర్స్..
Ishan Kishan

Ishan Kishan

Ishan kishan: పునరాగమనం తర్వాత ఇషాన్ కిషన్ చితక్కొడుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ మ్యాచ్‌లో బౌలర్లు ఎవరనే తేడా లేకుండా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ మ్యాచ్‌లో లాంగ్ బౌండరీ, స్లో బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మిగతా బ్యాటర్ల సింగిల్స్‌కు పరిమితమైనా ఇషాన్ కిషన్ దూకుడు ఆగలేదు. ప్రస్తుతం ICC T20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో కూడా ఇదే సత్తా చాటాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి టాప్-10లో స్థానం సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నారు.

Read Also: Dwaraka: ‘ఇన్‌స్టా రీల్‌ కోసం నా బిడ్డ ప్రాణాన్ని తీశారు..’ సహిల్ తల్లి కన్నీటి కథ!

ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు, ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 158 పరుగులు చేశాడు. అతని సగటు 52.66 , 197.50 స్ట్రైక్ రేట్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండు అర్ధ సెంచరీలు సాధించాడు, అత్యధిక స్కోరు 77.

టాప్-10లో ఇషాన్ కిషన్‌తో సహా నలుగురు భారత ప్లేయర్లు ఉండటం గమనార్హం. బుధవారం విడుదలైన ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న డాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ 891 పాయింట్లతో ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ 808 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక స్టార్ పాతుమ్ నిస్సాంక మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 6వ స్థానంలో, తిలక్ వర్మ 4వ స్థానంలో ఉన్నారు.

టాప్ 10 టీ20 బ్యాట్స్‌మెన్ (తాజా ICC ర్యాంకింగ్స్)

1) అభిషేక్ శర్మ
2) ఫిల్ సాల్ట్
3) పాతుమ్ నిస్సాంక
4) తిలక్ వర్మ
5) సాహిబ్‌జాదా ఫర్హాన్
6) సూర్యకుమార్ యాదవ్
7) జోస్ బట్లర్
8) ఇశాన్ కిషన్
9) టిమ్ షెఫర్ట్
10) ట్రావిస్ హెడ్