Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: క్రికెట్లో గెలుపు ఓటములు కామన్.. కానీ కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు చూపించే క్రీడాస్ఫూర్తి (Sportsmanship) అందరి మనసులు గెలుచుకుంటుంది. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. న్యూజిలాండ్ (New Zealand) పేస్ బౌలర్ మాట్ హెన్రీ (Matt Henry) తన బౌలింగ్‌తో భారత జట్టును దెబ్బతీసిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని సైతం జీరో (0) పరుగులకే ఔట్ చేసినా.. మ్యాచ్ ముగిశాక హెన్రీకి విరాట్ తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ మైదానంలో టీమిండియాతో జరిగిన నాల్గో వన్డేలో (ODI Match) భారత్ 244 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో కీవీస్ పేసర్ మాట్ హెన్రీ కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు (6 Wickets) పడగొట్టి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ముఖ్యంగా మ్యాచ్ తొలి ఓవర్లోనే హెన్రీ సంచలనం సృష్టించాడు. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)లను డకౌట్ (Duck out) చేసి పెవిలియన్‌కు పంపాడు. వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా ఇలా తొలి మూడు వికెట్లను ఒక్క పరుగు కూడా చేయకుండానే కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్ 5వ బంతికి హెన్రీ వేసిన అద్భుతమైన బంతికి కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కేవలం 4 బాల్స్ ఆడిన కోహ్లీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌ను కూడా గోల్డెన్ డకౌట్‌గా ఎల్బీడబ్ల్యూ (LBW) చేశాడు.
Also Read
- Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
- AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
- Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
- Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
భారత భారీ లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్ (27 పరుగులు), అక్షర్ పటేల్ (21 పరుగులు), నమన్ ధీర్ (21 పరుగులు) కొద్దిసేపు పోరాడినప్పటికీ, ఎవరూ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత హెన్రీ మళ్లీ బాల్ అందుకొని ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్ వికెట్లు తీసి తన వన్డే కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ (Best Bowling Figures) నమోదు చేశాడు. హెన్రీ దెబ్బకు టీమిండియా లక్ష్యానికి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన మాట్ హెన్రీ.. తనకు అందిన ఈ అద్భుత విజయానికి గల కారణాలను పంచుకున్నాడు. అక్కడ వీస్తున్న బలమైన ఈదురుగాలులు (Strong Winds) బౌలింగ్‌కు చాలా సహకరించాయని, తన వ్యూహం చాలా సింపుల్‌గా ఉందని తెలిపాడు. గాలి వేగం కారణంగా స్వింగ్ గురించి పెద్దగా ఆలోచించలేదని, మొదటి బంతి నుంచి తన బలాన్ని నమ్ముకుంటూ స్టంప్స్‌ను టార్గెట్ చేశానని చెప్పాడు. కొత్త బంతితో బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని ముందే ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించాడు. తొలి బంతే చాలా వేగంగా టర్న్ అవ్వడంతో బ్యాటర్లకు ఇబ్బందికరంగా మారిందని హెన్రీ చెప్పుకొచ్చాడు.
Virat Kohli Gifts his Jersey to Matt Henry At Bay Oval, Mount Maunganui.👕 #INDvsNZ https://t.co/GOtejuzxId
— Virat Kohli 18 (@viratkohlifc518) November 13, 2026
తాజావార్తలు
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
-
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!