Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
- అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం
- విరాట్ కోహ్లీ ఆగ్రహం సరైందేనా?
- ఎంసీసీ క్రికెట్ నిబంధనలు ఏమంటున్నాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli fumes over Rajat Patidar Controversial Dismissal: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూసింది. అర్షద్ ఖాన్ (3/22), రషీద్ ఖాన్ (2/19), జేసన్ హోల్డర్ (2/29) దెబ్బకు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. దేవ్‌దత్ పడిక్కల్ (40; 24 బంతుల్లో 5×4, 2×6) టాప్ స్కోరర్. మోస్తరు లక్ష్యాన్ని గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్ గిల్ (43; 18 బంతుల్లో 4×4, 3×6), జోస్ బట్లర్ (39; 19 బంతుల్లో 2×4, 4×6) మెరిశారు. ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ (3/28) మూడు వికెట్స్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటీదార్ ఔట్ నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ అవుట్ అయ్యాడు. అర్షద్ ఖాన్ వేసిన 7.4 బంతికి పాటీదార్ భారీ షాట్ ఆడాడు. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద జాసన్ హోల్డర్ క్యాచ్ పట్టగా.. అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. అయితే క్యాచ్‌ను అందుకునే క్రమంలో హోల్డర్ కిందపడ్డాడు. ఆ సమయంలో అతడు బంతిని కింద ఆనించినట్లు అనిపించింది. థర్డ్ అంపైర్ పాటీదార్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో డగౌట్లో విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. మ్యాచ్ అధికారితో వాదిస్తూ కనిపించాడు. మరోవైపు ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా అంపైర్ నిర్ణయంపై ఆగ్రహానికి గురయ్యాడు. హోల్డర్ పూర్తిగా కంట్రోల్‌లో లేడని, క్యాచ్ సమయంలో బంతి నేలను తాకినట్లు కనిపిస్తోందని ఇద్దరు వాదించారు. ఈ సంఘటన మైదానంలో ఉద్రిక్తతను పెంచింది.
Also Read
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
మరోవైపు క్రునాల్ పాండ్య కూడా ఆగ్రహంగా కనిపించాడు. మ్యాచ్ టెన్షన్ మధ్య ఈ వివాదం మరింత హీట్ పెంచింది. ఆటగాళ్ల భావోద్వేగాలు స్పష్టంగా బయటపడగా.. ఆర్సీబీ ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ‘ఔట్ లేదా నాట్ ఔట్?’ అనే ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. కొందరు అంపైర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం అది క్లియర్‌గా నాటౌట్ అని వాదిస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగం, థర్డ్ అంపైర్ నిర్ణయాలు ఎంత ముఖ్యమో మరోసారి ఈ సంఘటన రుజువు చేసింది. మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ అంపైర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో ఇలాంటి తప్పిదాలు జరగకూడదని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ఆర్సీబీ మోమెంటమ్‌ను పూర్తిగా దెబ్బతీసిందని విమర్శించారు.
మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా ఈ అంశంపై స్పందించాడు. ఎంసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం.. క్యాచ్ పూర్తి కావాలంటే ఫీల్డర్ బంతి మీద మాత్రమే కాకుండా తన కదలికలపై కూడా పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంసీసీ లా 33.3 ప్రకారం.. ‘క్యాచ్ అనేది ఫీల్డర్ బంతిని మొదట తాకినప్పటి నుంచి.. బంతి, తన కదలికలపై పూర్తి నియంత్రణ సాధించే వరకు కొనసాగుతుంది’ అని స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రకారం చూస్తే.. హోల్డర్ క్యాచ్ పట్టిన తర్వాత డైవ్ చేసి స్లైడ్ అవుతున్న సమయంలో పూర్తి కంట్రోల్‌లో లేడని చోప్రా అభిప్రాయపడ్డాడు. టీవీ రీప్లేల్లో బంతి నేలను తాకినట్లు కనిపించిందని కూడా అన్నాడు. పటిదార్ నాటౌట్ అనే అభిప్రాయంను ఆకాష్ వ్యక్తం చేశాడు.
🚨Virat Kohli and Andy flower’s fight with Umpires 🚨
– Rajat Patidar OUT on a controversial low catch by Jason Holder.
– Virat Kohli & Andy Flower LOSING it at the umpire Krunal Pandya ready to explode– Out or Not Out ??
pic.twitter.com/zQCmzdGzoX— Indian Cricket (@IPL2025Auction) April 30, 2026
తాజావార్తలు
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
Floating AI Data Centres: నీటిలో తేలియాడే AI డేటా సెంటర్లు.. శామ్సంగ్ కొత్త ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
-
Investment Schemes for Women: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 5 పెట్టుబడి పథకాలు.. చిన్న పొదుపుతోనే లక్షల సంపద సొంతం!
-
Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్… క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!