Virat Kohli Record: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఇదే మొదటిసారి!
- విరాట్ కోహ్లీ చెత్త రికార్డు
- 9 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి
- ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Registers Rare IPL Duck Record: క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు చెబితే.. ప్రతి ఒక్కరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పరుగుల వరద గుర్తుకు వస్తుంది. అద్భుత ఆటతో ఐపీఎల్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. అలంటి కింగ్ కోహ్లీ ఇప్పుడు ఓ చెత్త రికార్డుతో వార్తల్లో నిలిచాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఛేదనలో విరాట్ డకౌట్ అయ్యాడు. 2017 తర్వాత తొలిసారి లక్ష ఛేదనలో కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
ఇదివరకు 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డక్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో మ్యాచ్‌ల్లో లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ జట్టుకు కింగ్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026లో డకౌట్ అయ్యాడు. కోహ్లీని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) పేసర్ ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ చేశాడు. దాంతో అతడు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. గొప్ప బంతి వేశావ్ అంటూ.. మ్యాచ్ అనంతరం ప్రిన్స్ యాదవ్‌ను విరాట్ అభినందించడం విశేషం.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డక్స్ నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం 11 డక్స్‌తో 14వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మాజీ భారత వికెట్ కీపర్ దినేష్ కార్తిక్, రోహిత్ శర్మలు చెరో 18 డక్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లలో కూడా ఉన్నారు. ఈ జాబితాలో పియూష్ చావ్లా 16 డక్స్‌తో మూడో స్థానంలో ఉండగా.. మన్‌దీప్ సింగ్, అజింక్య రహానేలు 15 డక్స్‌తో తదుపరి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో మనీష్ పాండే, అంబటి రాయుడులు 14 డక్స్ నమోదు చేశారు. 13 డక్స్‌తో హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్ ఉన్నారు. 12 డక్స్‌తో రవిచంద్రన్ అశ్విన్, గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నారు. 11 డక్స్‌తో కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. డక్స్ రికార్డు ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!