Virat Kohli: 37 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా.. కింగ్ విరాట్ కోహ్లీకి ‘టేక్ ఏ బౌ’!
- మరోసారి తన క్లాస్‌ను నిరూపిస్తున్న విరాట్ కోహ్లీ
- ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి 49 పరుగుల ఇన్నింగ్స్
- ఆర్‌సీబీ తరఫున 5 మ్యాచ్‌లలో 228 పరుగులు
- 38 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి 49 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున 5 మ్యాచ్‌లలో 228 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కింగ్ సగటు 57.00గా, స్ట్రైక్ రేట్ 158.33గా ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్‌కు 2024లో గుడ్‌బై చెప్పినా, ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడకున్నా, కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన కోహ్లీ.. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే భారత్ వస్తున్నాడు. భారతదేశ పరిస్థితులకు భిన్నమైన వాతావరణంలో లండన్‌లో నివసిస్తూ, ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం 15 రోజుల ముందు మాత్రమే భారత్‌కు రావడం వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. కోహ్లీ తన ఫిట్‌నెస్, ఫామ్‌ను అద్భుతంగా మేనేజ్ చేస్తున్నాడు. అంతేకాదు టోర్నీకి ముందు పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేకపోయినా బ్యాటింగ్‌లో ఎక్కడా తడబడడం లేదు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
యువ ఆటగాళ్లతో పోటీ పడుతూ.. 37 ఏళ్ల వయస్సులో కూడా విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. 2008లో టీమిండియాలోకి వచ్చినా.. ఇప్పటికీ కింగ్‌లో అదే ఉత్సాహం, అదే పరుగుల దాహం ఉండడం విశేషం. విరాట్ అనుభవం, ఫిట్‌నెస్, కట్టుదిట్టమైన క్రమశిక్షణ ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రస్తుత క్రికెట్‌లో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో, యువ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో కోహ్లీ ఇలా రాణించడం అతని గొప్పతనాన్ని మరోసారి చాటుతోంది. ఈ ఫామ్ కొనసాగితే.. ఐపీఎల్ 2026లో కూడా కోహ్లీ గట్టి ముద్ర వేయడం ఖాయం.
తాజావార్తలు
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?