IPL Chairman: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్సీబీ విక్టరీ పరేడ్ గురించి నాకు తెలియదు అని వెల్లడించారు. అయితే, స్టేడియం గేట్ల వద్ద జరిగిన తొక్కిసలాట గురించి లోపల ఉన్న అధికారులకు బయట ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను అని చెప్పుకొచ్చారు. ఇక, పరిస్థితి గురించి మాకు తెలియగానే మేము ఆర్సీబీ యాజమాన్యంతో మాట్లాడాం.. వారు వేడుకను త్వరగా పూర్తి చేశారని అరుణ్ ధుమల్ వెల్లడించారు.
Read Also: RCB Stampede: సీఎం, డిప్యూటీ సీఎం హాగ్స్, ఫోటోల్లో బిజీగా ఉన్నారు.. తొక్కిసలాటను పట్టించుకోలేదు..
అయితే, స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటకు గల కారణాలతో పాటు పెద్ద సంఖ్యలో జనం స్టేడియానికి ఎలా వచ్చారు? అనేది తెలియదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఇక, ప్రోటోకాల్ ప్రకారం.. బీసీసీఐ, ఐపీఎల్ వేడుకలు మంగళవారం రాత్రి ముగిశాయని ఆయన అన్నారు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సంబంధిత ఫ్రాంచైజీపై ఆధారపడి ఉంటుంది.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందరు అధికారులు అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా, ఆర్సీబీ జట్టుకు సన్మానం చేయాలని నిర్ణయించిన కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఈ కార్యక్రమం కోసం చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు సిద్ధం చేయగా అభిమానులు ఒక్కసారిగా రావడంతో స్టేడియంలో బయట తొక్కిసలాట జరిగింది.