బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రమాదం పూర్తిగా హృదయ విదారకం అన్నారు.
IPL Chairman: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేడియం గేట్ల వద్ద జరిగిన తొక్కిసలాట గురించి లోపల ఉన్న అధికారులకు బయట ఏం జరుగుతుందో తెలియదని అన్నారు.
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన దురదృష్టకర తొక్కిసలాట సంఘటనపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఆయన వాపోయారు. వేడుకల నిర్వహనపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు వేడుకలను బాగా ప్లాన్ చేసి ఉండాల్సిందన్నారు. ప్రజలు తమ క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడారు. అభిమానులు ఎక్కువగా తరలిరావడంతో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం రోడ్‌షోను…