SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్‌వుడ్ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!
- ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన
- మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు కీలక విజయాలు
- బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Who Can Stop Vaibhav Suryavanshi at Uppal Stadium Today: ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్.. మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు కీలక విజయాలు అందిస్తున్నాడు. తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్లు చేస్తూ ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. చెన్నైపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్.. తన అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. బెంగళూరుపై 26 బంతుల్లో 78 పరుగులు చేసి మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను నిరూపించాడు.
ప్రత్యేకంగా ఐపీఎల్ 2026లో టాప్ బౌలర్లపై కూడా వైభవ్ సూర్యవంశీ ఎలాంటి భయం లేకుండా ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సునాయాసంగా సిక్సులు బాదాడు. టాప్ బ్యాటర్లు కూడా బుమ్రా బౌలింగ్‌లో తడబడగా.. 15 ఏళ్ల వైభవ్ మాత్రం అద్భుతంగా ఎదుర్కొన్నాడు. అంతేకాదు బెంగళూరు పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లను కూడా వదలలేదు. బౌండరీలు, సిక్సులతో చెలరేగాడు. 2026 ఐపీఎల్లో అగ్రశ్రేణి బౌలర్లను వణికిస్తున్న వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. 15 ఏళ్ల బుడ్డోడు ఇలా ఎలా ఆడుతున్నారు అని అందరూ షాక్ అవుతున్నారు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఇక ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే నిలిచింది. ఇప్పటికే టాప్ బౌలర్లను ఆటాడుకున్న వైభవ్.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లపై ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది. జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి, ఇషాన్ మలింగలు ఫామ్ లేమితో తంటాలు పడుతున్నారు. యువ సంచలనం సూర్యవంశీని ఆపడం వీరి వల్ల అవుతుందా? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఎవరైనా ఆపుతారో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..