Pat Cummins: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.. 300 స్కోర్ కొడుతాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Players Enjoys Hyderabad City: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సంచలన విజయాలతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో 266, 277, 287 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళుతోంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు గెలిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుతుంది. మే 2న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ టీమ్ మూడు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకుంది. మ్యాచ్‌కు సమయం ఉండడంతో హైదరాబాద్ నగరంలో సన్‌రైజర్స్ ప్లేయర్స్ సందడి చేస్తున్నారు. ఓ వైపు షాపింగ్స్ చేస్తూ.. మరో వైపు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బేగంపేటలోని లైఫ్ స్టైల్లో, అమీర్‌పేటలోని ఓ హోటల్లో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా కమిన్స్ మాట్లాడుతూ తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని తెలిపాడు. అంతేకాదు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 300 స్కోర్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
Also Read: CSK vs PBKS: వరుస మ్యాచ్‌ల్లో పంజాబ్‌తో ఢీ.. ప్లే ఆఫ్స్ చేరేందుకు చెన్నైకి ఇదే సూపర్ ఛాన్స్!
తాజాగా కొండాపూర్‌లోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ సందడి చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికార భాగస్వామిగా ఉన్న రాన్ బ్రాండ్ స్టోర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్, టీ నటరాజన్ పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. పలువురు అభిమానులు అడిగిన సరదా ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు ఇచ్చారు. అభిమానులు క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!