Chennai Super Kings playoff Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. వరుస ఓటములతో ఇప్పటికే పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. చెన్నై ఆ దిశగా దూసుకెళుతోంది. ప్లే ఆఫ్స్ చేరేందుకు చెన్నైకి ఇదే సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వరుస మ్యాచ్‌ల్లో పంజాబ్‌తో చెన్నై ఢీకొట్టనుంది. నేడు చెన్నై, పంజాబ్ తలపడనుండగా.. మే 5న మరోసారి ఇరు జట్లు ఆడనున్నాయి. ఓటములతో సతమతం అవుతున్న పంజాబ్‌ను వరుసగా ఓడిస్తే.. చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి.
ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 5 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. అందులో రెండు పంజాబ్‌తో ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్, బెంగళూరుతో చెన్నైకి మ్యాచ్‌లు ఉన్నాయి. ఐదింటిలో కనీసం మూడు గెలిస్తే.. చెన్నై ప్లే ఆఫ్స్ చేరుతుంది. కాబట్టి పంజాబ్‌తో మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. చూడాలి మరి చెన్నై విజయాలు సాధిస్తుందో లేదో.
Also Read: T20 World Cup 2024: కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. నలుగురు బ్యాటర్లు మాత్రమే! అఫ్గానిస్థాన్ జట్టు ఇదే
మరోవైపు పంజాబ్ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో పంజాబ్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. చెన్నైతోనే రెండు మ్యాచ్‌లు ఉండగా.. బెంగళూరు, రాజస్థాన్, హైదరాబాద్ జట్లతో ఆడాల్సి ఉంది. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంది. బెంగళూరు మినహా అన్ని జట్లు ఫామ్ మీదున్నాయి. ఏదైనా సంచనాలు నమోదైతే తప్ప పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు.