Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
- రెండో అర్ధ భాగంలో పంజాబ్ ఊహించని పరాజయాలు
- వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన పరిస్థితి
- ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్
- చాహల్‌కు ఎందుకు ఓవర్ ఇవ్వలేదో చెప్పిన శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer on PBKS Loss vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రథమార్ధంలో అద్భుత ఆటతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. రెండో అర్ధ భాగంలో ఊహించని పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన స్థితి వచ్చింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినప్పటికీ జట్టు ఓటమిపాలవడంతో.. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ వ్యూహాలపై నిజాయితీగా స్పందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చేసిన పొరపాట్లు, సరైన ప్లానింగ్ లేకపోవడం జట్టు ఓటమికి కారణమైందని అంగీకరించాడు.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ వికెట్‌పై 210 పరుగులు చాలా ఎక్కువ. బంతి బాగా సీమ్ అవుతోంది. బౌన్స్ కూడా స్థిరంగా లేదు. ఈ పరిస్థితుల్లో 210 అనేది కనీసం 30 పరుగులు ఎక్కువ స్కోరే’ అని తెలిపాడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఎందుకు ఓవర్ ఇవ్వలేదన్న ప్రశ్నకు అయ్యర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘చాహల్‌ను మిడిల్ ఓవర్లలో బౌలింగ్‌కు తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. కానీ పిచ్ సీమర్లకు బాగా సహకరిస్తోంది. మా పేసర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు వస్తాయని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
డెత్ ఓవర్లలో యార్కర్లు ఎందుకు ప్రయత్నించలేదని అడగగా.. ‘మేము ఇంకా హార్డ్ లెంగ్త్‌కే కట్టుబడి ఉన్నాం. కొత్త బ్యాటర్ వచ్చినప్పుడు షార్ట్ ఆఫ్ హార్డ్ లెంగ్త్ బంతులు వేయడం ఉత్తమం అని నేను నమ్ముతాను. అలాంటి బంతులను వరుసగా వేస్తే.. ఎప్పుడో ఒకసారి మిస్ హిట్ వస్తుంది. అక్కడ వికెట్ దక్కే అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్ అయ్యర్ వివరించాడు.
అయితే చివరికి తమ వ్యూహాలే విఫలమయ్యాయని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ ఒప్పుకున్నాడు. ‘మా ప్లానింగ్‌లో లోపం ఉంది. ఎగ్జిక్యూషన్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. అదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది’ అని పేర్కొన్నాడు. అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం బౌలింగ్ మార్పుల విషయంలో కెప్టెన్సీ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..