Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!
- టీ20ల్లో సంజు శాంసన్ చరిత్ర
- కీపర్‌గా నంబర్ వన్‌గా సంజు
- ఐపీఎల్‌లో వికెట్‌కీపర్‌గా మూడు సెంచరీలు
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఓపెనర్, కేరళ కింగ్ సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన భారత వికెట్ కీపర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. సంజు ఖాతాలో ఇప్పుడు ఆరు శతకాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, భారత్, కేరళ, రాజస్థాన్ రాయల్స్ తరపున సంజు ఆడాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉండగా.. రిషబ్ పంత్ మూడు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
సంజు శాంసన్ ఇప్పటివరకు వికెట్‌కీపర్‌గా 235 టీ20 మ్యాచ్‌లు ఆడి 6298 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ట్రేడ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరిన సంజు.. ఈ ఏడాది ఇప్పటికే రెండు శతకాలు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది అతనికి ఐదో సెంచరీ కావడం విశేషం. మొత్తంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా అత్యధిక టీ20 సెంచరీలు చేసిన ఆటగాడిగా క్వింటన్ డి కాక్ ముందంజలో ఉన్నాడు. అతని ఖాతాలో 9 శతకాలు ఉన్నాయి. అయితే భారత ఆటగాళ్లలో మాత్రం సంజు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశాడు.
Also Read
- Ruturaj Gaikwad: కన్నీరు దిగమింగుతూ జట్టు కోసం ఆడాడు.. ఈ విజయం అతడికే అంకితం!
- MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
- MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
ఐపీఎల్‌లో కూడా సంజు శాంసన్ తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు 122 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా మూడు సెంచరీలు సాధించాడు. డికాక్ కూడా ఐపీఎల్‌లో మూడు సెంచరీలు బాదాడు. ఈ గణాంకాలు చూస్తే సంజు ప్రస్తుతం భారత వికెట్‌కీపర్-బ్యాటర్లలో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని చెప్పవచ్చు. ఐపీఎల్ 2026లో సంజు 7 ఇన్నింగ్స్‌లలో 293 రన్స్ చేశాడు. సగటు 58.6 కాగా.. స్ట్రైక్ రేట్ 178.66గా ఉంది.
తాజావార్తలు
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!
-
Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
-
Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
-
Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?
-
Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!