OTR : గులాబీ పార్టీలో కొత్త వ్యూహం మొదలైందా?
- వర్గపోరు కట్టడికి బీఆర్ఎస్ అధిష్టానం ప్లానింగ్
- ఉమ్మడి వరంగల్ సమీక్షలో హెచ్చరికలు, ఫలించిన ప్రయోగం
- గ్రూపు రాజకీయాలు చేస్తే భవిష్యత్‌తో తీవ్ర పరిణామాలని వార్నింగ్
- సమన్వయం లేకనే వరంగల్ జిల్లాలో దెబ్బ తిన్నామంటూ వివరాలు
- ఉదాహరణలతో చెప్పిన కేటీఆర్, సెట్ అయిన జిల్లా లీడర్స్
- మిగతా జిల్లాలకు సేమ్ ఫార్ములా అప్లయ్ చేయాలని నిర్ణయం
- ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో
- పరస్పరం ఓడించుకునే ప్రోగ్రామ్‌తో మొత్తం పార్టీనే దెబ్బతిందని విశ్లేషణ
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న బీఆర్ఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR : పార్టీలో అంతర్గత విభేదాల కట్టడిపై దృష్టి సారిస్తోంది బీఆర్ఎస్ అధినాయకత్వం. ఆధిపత్య పోరు, వర్గాలుగా విడిపోవడం, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపం లాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమీక్ష సందర్భంగా ఆయన చేసిన హెచ్చరికలు, చేసిన చేసిన దిశానిర్దేశం, వాటి ఫలితాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై గత వారం వరంగల్ జిల్లా నేతలతో సమీక్ష జరిపారు కేటీఆర్. ఆ సమయంలో జిల్లా నాయకుల్ని సీరియస్‌గానే మందలించారట. పట్టభద్రుల ఓట్ల నమోదు విషయంలో కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సీనియర్ నేతలు అలసత్వం వహిస్తున్నారంటూ మొదలుపెట్టిన కేటీఆర్.. గ్రూపు రాజకీయాలను ప్రస్తావించినట్టు తెలిసింది. పార్టీలో ఉంటూ గ్రూపు రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతున్నారు గులాబీ నేతలు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఎన్నికల సమయంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలు చేయడం వల్లనే ఎమ్మెల్యే సీట్లు పోగొట్టుకున్నామంటూ… కేటీఆర్ ఉదాహరణతో సహా చెప్పినట్టు సమాచారం. ఏ నియోజకవర్గంలో ఏ నేతను ఓడించడానికి ఎవరు పనిచేశారో కూడా గుర్తు చేసినట్టుగా చెబుతున్నారు పార్టీ నేతలు. ఒకే పార్టీలో ఉండి గ్రూపు రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో అస్సలు సహించబోమని ఉమ్మడి వరంగల్ నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన హెచ్చరికలు బాగానే వర్క్ అయ్యాయని చెబుతున్నారు తెలంగాణ భవన్ నేతలు.
దీంతో… ఇదే ఫార్ములాను అన్ని జిల్లాలకు అప్లయ్ చేయాలని, వాళ్ళను పిలిపించి క్లాస్‌లు తీసుకోవాలని డిసైడైనట్టు తెలుస్తోంది. ముందుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల నాయకుల్ని త్వరలోనే పిలిపించబోతున్నారట. గ్రూప్ రాజకీయాలు చేయకుండా కలిసికట్టుగా పని చేస్తేనే భవిష్యత్తులో పదవులతో పాటు టికెట్లు కూడా ఇస్తామంటూ ఈ సమావేశాల ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఒక నేత ఓడిపోవడానికి మరొకరు ప్రయత్నించడం ద్వారా… వోవరాల్‌గా అందరూ ఓడిపోయే, పార్టీ పరువుపోయే పరిస్థితి వస్తోందని, ఆ సంగతి గ్రహించే…ఇక స్టేట్ లెవల్ ఉతుకుడు ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందు ఆరు ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశాల తర్వాత… మరో నాలుగు జిల్లాల లీడర్స్‌ని కూడా కేటీఆర్ ప్రత్యేకంగా కలవబోతున్నారట. సాధారణ ఎన్నికలకు మరో రెండున్నర సమయం ఉన్నందున ఇప్పట్నుంచే అందర్నీ కంట్రోల్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మేం గెలవాలి, పక్క సీట్ల లో పోటీ చేసిన మా పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని భావించే వాళ్ళ వల్లనే గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకుండా పోయిందన్నది అధిష్టానం అభిప్రాయం.
Also Read
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
- Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
అందుకే ఈ విషయంలో చిన్న, పెద్ద తేడా లేకుండా… గ్రూప్ పాలిటిక్స్‌ని ప్రోత్సహించేది ఎవరైనాసరే…కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. అందుకే… గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఎన్నికల ముందే సెట్ చేస్తే…. అప్పటికి ఇబ్బంది ఉండబోదన్నది అధిష్టానం అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. అందుకోసమే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారని, మిగతా జిల్లాలకు కూడా దాన్నే అప్లయ్ చేయాలనుకుంటున్నారని అంటున్నారు గులాబీ నేతలు.
తాజావార్తలు
-
OTR : గులాబీ పార్టీలో కొత్త వ్యూహం మొదలైందా?
-
Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
Indian Cinema: హీరో వేషాలు బోర్ కొట్టాయా?
-
PDS Rice : ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
ట్రెండింగ్
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!