Dinesh Karthik: దినేష్ కార్తీక్ స్కూప్ సిక్స్.. విరాట్ కోహ్లీ సంబరాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli jump out of his seat after Dinesh Karthik Hit Scoop Six: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్‌సీబీకి అద్బుతమైన విజయాన్ని అందించాడు. దాంతో ఫినిషర్‌గా డీకే మరోసారి నిరూపించుకున్నాడు. అయితే చివరి ఓవర్లో డీకే కొట్టిన ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
17 ఓవర్‌లో అనూజ్ రావత్ అవుట్ అయిన అనంతరం దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. వచ్చిరావడంతోనే తన బ్యాట్‌కు పని చెప్పాడు. సామ్ కర్రన్ వేసిన 17 ఓవర్‌ను ఫోర్ బాది బాదాడు. చివరి రెండు ఓవర్లలో ఆర్‌సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా.. డీకే చెలరేగిపోయాడు. 19 ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, సిక్స్ బాదాడు. 20 ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ వేయగా. తొలి బంతినే డీకే స్కూప్ షాట్ ఆడాడు. బంతి వెళ్లి స్టాండ్స్ లో పడింది. దాంతో విజయానికి చేరువైన ఆనందంలో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కుర్చీ లోంచి లేచి గంతులేశాడు. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్‌సీబీ కెప్టెన్
20 ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన దినేష్ కార్తీక్.. మ్యాచ్‌ను ముగించాడు. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ మరో నాలుగు బంతులు ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతులు ఎదుర్కొన్న డీకే.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విరాట్ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6), మహిపాల్ లొమ్రార్ (17 నాటౌట్; 8 బంతుల్లో 2×4, 1×6) రాణించారు.
Six by Dinesh Karthik and reaction by #ViratKohli𓃵 as seen in this video is treat to RCB fans #RCBvsPBKS pic.twitter.com/mjgypO352P
— Sherlock Ohms (@Wanmohnev) March 25, 2024
THE MOST OUTRAGEOUS SHOT UNDER PRESSURE. 🤯
– Dinesh Karthik is here to stay…!!!pic.twitter.com/0es5Bdj7XP
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024
తాజావార్తలు
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!