Preity Zinta: ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొట్టలేదు.. పంజాబ్ గెలువలేదు: ప్రీతి జింతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta on MS Dhoni: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొట్టాలని తాను కోరుకున్నానని బాలీవుడ్ నటి ప్రీతి జింతా తెలిపారు. ధోనీ సిక్స్‌లు కొట్టినా.. తమ జట్టు పంజాబ్ గెలవాలని కోరుకున్నానని చెప్పారు. ధోనీ సిక్స్‌లు కొట్టలేదని, పంజాబ్ మ్యాచ్ గెలువలేదని ప్రీతి నిరాశ చెందారు. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తొలి బంతికే ఔటై పెవిలియన్‌కు చేరాడు.
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ప్రీతి జింతా సందడి చేశారు. పంజాబ్ బౌలర్లు వికెట్స్ తీసినప్పుడు, బ్యాటర్లు రన్స్ బాదినపుడు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎంఎస్ ధోనీ ఔటైనపుడు మాత్రం అయ్యో అంటూ నిరాశ చెందారు. ఓమేశ్ క్రికెట్ హాలిక్ అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఓ అభిమాని.. ప్రీతి జింతాకు ఈ రోజు ఒక అభ్యర్థన చేశాడు. ‘ప్రీతి మేడమ్.. మేం ఎంఎస్ ధోనీని పంజాబ్ కింగ్స్ జట్టులో చూడాలని అనుకుంటున్నాం’ అంటూ ఓ ఎమోజీని పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎరుపు, పసుపు లవ్ సింబల్స్‌ను జత చేశాడు. ప్లీజ్ చాట్ మేడమ్ అని కోరాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Asha Sobhana: భారత మహిళా క్రికెట్‌లో ఆశా శోభన సరికొత్త చరిత్ర!
అభిమానికి ప్రీతీ జింతా రిప్లై ఇచ్చారు. ‘ఎంఎస్ ధోనీని ఎవరు కాదంటారు. ప్రతి ఒక్కరూ ఆయనను కోరుకుంటారు. నాతో సహా ప్రతి ఒక్కరూ ఆయనకు అభిమానులే’ అని ప్రీతీ పేర్కొన్నారు. ‘మ్యాచ్‌లో పంజాబ్ జట్టు గెలవాలని, ధోనీ సిక్సర్‌లు కొట్టాలని నేను కోరుకున్నా. కానీ దురదృష్టవశాత్తు మా టీమ్ గెలువలేదు. ధోనీ సిక్స్‌లు కొట్టలేదు’ ప్రీతి చెప్పుకొచ్చారు. ప్రీతీ జింతా ఇచ్చిన ఈ రిప్లై నెటిజన్‌ల మనసు దోచుకుంది.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!