Hardik Pandya slaps Rs 12 Lakh fine for over rate offence: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌పై అనూహ్య విజయం సాధించి.. ఆనందంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. పంజాబ్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ 2024లో తరచూ స్లో ఓవర్ రేట్ నమోదవుతున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2024లో ఇది తొలి తప్పిదం కావడంతో హార్దిక్ పాండ్యా నామమాత్రపు జరిమానాతో తప్పించుకున్నాడు. మళ్లీ ఇదే రిపీటైతే కెప్టెన్ హార్దిక్‌తో పాటు జట్టు సభ్యులందరూ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే.. జరిమానాతో పాటు వేటు కూడా పడుతుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ సారథి శుబ్‌మన్ గిల్, రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌కు జరిమానా పడింది. తాజాగా ముంబై సారథి హార్దిక్‌కు జరిమానా పడింది.
Also Read: Sivakarthikeyan: ఓటు బుల్లెట్ కన్నా శక్తివంతమైనది: శివకార్తికేయన్
స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాతో పాటు మ్యాచ్‌లు కూడా కోల్పోవాల్సి వస్తోంది. నిర్ణీత సమయంలోపు పూర్తి ఓవర్లు పూర్తి చేయకపోతే.. 30 యార్డ్స్ సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉండాల్సి ఉంటుంది. మాములుగా చివరి రెండు ఓవర్లలో 30 యార్డ్స్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను పెడతారు. చివరి ఓవర్లలో ఓ ఫీల్డర్ తక్కువైతే.. అది గెలుపోటములను తారుమారు చేస్తుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా.. 30 యార్డ్స్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లను మాత్రమే పెట్టడంతో కొన్ని జట్లు గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయాయి.