Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
- సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక విజయం
- ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
- చెపాక్ వంటి పిచ్‌పై ఛేదన పూర్తి చేయడం టఫ్
- ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వల్లే గెలిచాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కీలక విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. చెపాక్ వంటి టఫ్ పిచ్‌పై ఛేదన పూర్తి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సాధారణంగా తాము ఆడే దూకుడు శైలికి భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ కీలక భాగస్వామ్యమే మ్యాచ్‌ను మలుపుతిప్పిందని.. ఈ విజయం క్రెడిట్ వారికే ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బంతి నెమ్మదిగా వచ్చింది. కొన్నిసార్లు గ్రిప్ కూడా అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన బ్యాటర్లకు ఆడటం చాలా కష్టం. కానీ ఇషాన్, క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కొందరు బౌలర్లను టార్గెట్ చేస్తూ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారు. ఆ భాగస్వామ్యమే మ్యాచ్ గెలిపించింది’ అని తెలిపాడు. గత మ్యాచ్‌లో తక్కువ స్కోరుకు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ విధానంపై ఎలాంటి చర్చ జరిగిందని అడగగా కమిన్స్ సరదాగా స్పందించాడు. ‘మేము నిలకడైన బ్యాటింగ్ చేయం. కానీ అవసరం వచ్చినప్పుడు ఎలా ఆడాలో మా ఆటగాళ్లకు తెలుసు. ఈ పిచ్‌పై మొదటి నుంచే దూకుడుగా ఆడటం సరైంది కాదని అర్థమైంది. పరిస్థితులకు తగ్గట్టు ఆడినందుకే ఈ విజయం సాధించాం’ అని చెప్పుకొచ్చాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
చెన్నై చేసిన 180 పరుగుల స్కోర్ గురించి కూడా కమిన్స్ మాట్లాడాడు. ‘ఈ వికెట్‌పై 180 పరుగులు మంచి స్కోరే. బహుశా అది తక్కువ స్కోర్ లేదా కాస్త ఎక్కువ కూడా కావచ్చు. కానీ మాకు 1-2 మంచి భాగస్వామ్యాలు అవసరమని తెలుసు. ఒకసారి క్రీజులో సెట్ అయితే బ్యాటింగ్ కొంచెం సులభమవుతుంది. చెన్నై ఆటగాళ్లకు ఈ పిచ్‌ను బాగా చదివారు. ఇక్కడ ఛేదన చేస్తూ చాలా జట్లు విజయాలు సాధించాయి. అందుకే వారు తీసుకున్న నిర్ణయం మమ్మలి ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. టాప్-2లో నిలిచే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు అసలైన పోరు మొదలవుతోంది. మా జట్టులో మంచి వాతావరణం ఉంది. ఇషాన్ కూడా మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చూసుకున్నాడు. అతడికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. జట్టు ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!