Rohit Sharma-Dinesh Karthik: ప్రపంచకప్ కోసమే ఆడుతున్నావ్ కదా.. కార్తీక్‌ను టీజ్ చేసిన రోహిత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Funny Comments on Dinesh Karthik: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అభిమానులు హార్దిక్ పాండ్యాను గేలి చేస్తుంటే విరాట్ కోహ్లీ అడ్డు చెప్పడం.. రోహిత్ శర్మను విరాట్ గిల్లడం.. జస్ప్రీత్ బుమ్రాకు మహమ్మద్ సిరాజ్ శిరస్సు వంచి సలాం కొట్టడం లాంటి సన్నివేశాలు జరిగాయి. అయితే అన్నింటిలోకెల్లా.. దినేశ్ కార్తీక్‌ను రోహిత్ శర్మ టీజ్ చేయడం హైలెట్‌గా నిలిచింది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ చెలరేగాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్లో.. నాలుగు బౌండరీలతో అలరించాడు. ఈ నాలుగు బౌండరీలు కూడా థర్డ్ మ్యాన్ వైపు వెళ్లడం విశేషం. ఇక జస్ప్రీత్ బుమ్రా వేసిన 19వ ఓవర్లో వరుసగా 2 వికెట్లు కోల్పోగా.. చివరి బంతిని డీకే సిక్సర్‌గా మలిచాడు. వెంటనే కార్తీక్ దగ్గరకు వచ్చిన రోహిత్ శర్మ.. సరదాగా టీజ్ చేశాడు. ‘ప్రపంచకప్ సెలక్షన్ కోసం ఆడుతున్నావా?.. శభాష్ కార్తీక్. ప్రపంచకప్ ఉందని మెదడులో ఆలోచనలు ఉంచుకో. త్వరలో ప్రపంచకప్ ఉంది, ప్రపంచకప్ ఉంది. ప్రపంచకప్ ఆడుతావ్’ అని నవ్వుతూ అన్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: MI vs RCB: ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలే!
రోహిత్ శర్మ సరదా మాటలకు దినేశ్ కార్తీక్‌తో పాటు ఇషాన్ కిషన్ కూస నవ్వులు పూయించారు. రోహిత్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2024 తర్వాత టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. భారత జట్టులో స్థానం కోసం కార్తీక్ ఎదురుచూస్తున్నాడు. ఇలానే ఆడితే జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. టీ20 టీ20 ప్రపంచకప్ 2022 ముందు కూడా డీకే ఐపీఎల్లో చెలరేగి భారత జట్టులో చోటు సంపాదించాడు. అయితే ఐపీఎల్లో ఆడినంతగా.. మెగా టోర్నీలో ఆడలేదు.
Rohit Sharma teasing DK with ” World Cup Khelna hai saabash”😂
Lekin Serious Ishan Kishan le gaya #RCBvMI #RCBvsMI | #MIvRCB | #surya #BharatRatnaForNarayanaMurthy #ChampionsLeague #RohitSharma𓃵 #Kohli HARDIK HARDIK #JaspritBumrah #MIvRCB #RCBvMI Nitin Menon WANKHEDE
Rohit… pic.twitter.com/wl4CgzZ6XR— Pushkarkuntal (@Pushkarkuntal1) April 11, 2024
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!