KKR vs DC: కోల్‌కతా అలవోక విజయం.. 7 వికెట్ల తేడాతో గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సాధించింది. కోల్‌కతా బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ (68) రన్స్ చేయడంతో కేకేఆర్ అలవోకంగా విజయం సాధించింది. కోల్‌కతా బ్యాటింగ్ లో సునీల్ నరైన్ (15), రింకూ సింగ్ (11) పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (33*), వెంకటేష్ అయ్యర్ (26*) పరుగులతో రాణించడంతో గెలుపును నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, విలియమ్స్ ఒక వికెట్ తీశారు.
Read Also: Narendra Modi : మే 8న ఎములాడకు ప్రధాని మోడీ రాక?
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 153 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఓ మోస్తారు స్కోరును సాధించింది. ఢిల్లీ బ్యాటింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా (35*) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (27) పరుగులు సాధించాడు. మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృధ్వీ షా (13), జేక్ ఫ్రేసర్ (12) పరుగులు చేసి నిరాశపరిచారు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (18) పరుగులు చేశాడు. హోప్ (6), అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (4), కుమార్ కుషాగ్రా (1), రషీక్ సలాం (8) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగాడు. కీలకమైన వికెట్లు తీసి పరుగులు చేయకుండా ఆపాడు. ఆ తర్వాత.. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ కు తలో వికెట్ దక్కింది.
Read Also: Peru Bus Accident: దక్షిణ అమెరికా పెరూలో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 23 మంది మృతి
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!