Narendra Modi : మే 8న ఎములాడకు ప్రధాని మోడీ రాక?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం పంపింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు… ఆరోజు ఉదయం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటిస్తారు. ప్రధాని రాక సమాచారాన్ని అందుకున్న జిల్లా నాయకత్వం సభాస్థలి, ఏర్పాట్లపై ద్రుష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఎములాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 10 గంటలకు రాజన్న దర్శనాంతరం ఎములాడలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు హాజరై మోడీ ప్రసంగించేలా షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ రెండు, మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది. మరోవైపు ఈరోజు ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇంఛార్జీల సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా ఇంఛార్జీ మీసాల చంద్రయ్య, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రధాని మోడీ ఈనెల 8న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో వేములవాడలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, సభను దిగ్విజయవంతం చేసేలా ప్రతి ఒక్క కార్యకర్త క్రుషి చేయాలని కోరారు. అందులో భాగంగా ప్రధాని ఎన్నికల ప్రచార బహిరంగ సభాస్థలిని ఎంపిక చేసేందుకు రేపు మధ్యాహ్నం వేములవాడ వెళ్లనున్నారు. సభాస్థలి ఎంపిక అనంతరం జిల్లా, నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమై మోడీ సభ ఏర్పాట్లపై చర్చించనున్నారు.
బీజేపీలో కొనసాగుతున్న చేరికలు
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
భారతీయ జనతా పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నుండి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసిన పత్తిపాక సురేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరందరికీ బండి సంజయ్ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన పిస్క వెంకటేశ్, బుదారం సదానంద్, బీమని నగేశ్, కొంపల్లి మురళి, గుడ్ల సురేష్ కుమార్, శ్రీధర్, దాసరి వెంకటేశ్, ఆడెపు లక్ష్మణ్, సత్యవికాస్, బలుసాని అనిల్, తుపాకుల రమేశ్, శివపురం శ్రీనివాస్, బోగ కనకయ్య, శ్రీరాం విష్ణు, బూర పవన్, పల్లె ప్రశాంత్ తదితరులు బీజేపీలో చేరారు.
అట్లాగే కరీంనగర్ లోని లక్ష్మీ నగర్ 31వ డివిజన్ కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత వి.కిశోర్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు ఈరోజు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వీరిలో వి.నర్సింహరాజు, బి.నవీన్, కె.నాగరాజు, జి.సాయికిరణ్, జి.మణిదీప్, జి.సాయి క్రిష్ణ, జి.సాయి కుమార్, జి.శివ, పి.అంజి, పి.శ్రీనివాస్, ఎండీ.హస్సన్ అన్సార్, టి.నిరంజన్, ఏ.అరుణ్, మీనార్ ఖాన్, వి.రాకేశ్ తదితరులు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు. ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుు నారాయణసహా పలువురు నాయకులు సైతం ఎంపీ కార్యాలయానికి వచ్చి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!