Kolkata Knight Riders Scored 84 In First 10 Overs: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. కేకేఆర్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. తొలి పది ఓవర్లలో కేకేఆర్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. రహమానుల్లా గుర్బాజ్ విజృంభించడం వల్లే.. కేకేఆర్ స్కోరు బోర్డు ఇలా పరుగులు పెడుతోంది.
WTC 2023: శుబ్మన్ గిల్ వద్దు.. అతడే ముద్దు
క్రీజులోకి అడుగుపెట్టిన మొదటి నుంచే కేకేఆర్ తన దూకుడు ప్రదర్శించింది. ఓవైపు జగదీశన్ నిదానంగా తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా.. గుర్బాజ్ వచ్చి రావడంతోనే పరుగుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. ఇక జగదీశన్ కూడా దూకుడుగా రాణించాలని అనుకున్న టైంలో.. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా అతడు వెనుదిరిగాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. అతని తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. మరోవైపు.. గుర్బాజ్ మాత్రం తన జోరుని ఆపలేదు. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ వచ్చాడు. తద్వారా అతడు 27 బంతుల్లోనే తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
Maoist letter : వరంగల్ లో మావోయిస్టుల లేఖ కలకలం
ఇక వెంకటేశ్ అయ్యర్ కూడా చెలరేగిపోవడం ఖాయమని అనుకుంటుండగా.. అతడు 11వ ఓవర్‌లో జాషువా లిటిల్ వేసిన తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఎల్బీడబ్య్లూగా అతడు పెవిలియన్ చేరాడు. వెంకటేశ్ ఔట్ అవ్వడంతో క్రీజులోకి కెప్టెన్ నితీశ్ రానా వచ్చాడు. అతడు కూడా ఒక ఫోర్ కొట్టి, పెవిలియన్ చేరాడు. దీంతో.. 10.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేకేఆర్ 88 పరుగులు చేసింది. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే.. లిటిల్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.