Micheal Vaughan Prefers This Cricketer Over Shubman Gill For WTC Final: యువ ఆటగాడు శుబ్మన్ గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే! కొంతకాలం నుంచి అతడు అన్ని ఫార్మాట్‌లలోనూ బాగా రాణిస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా దుమ్ముదులిపేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో చోటు కల్పించారు. అయితే.. శుబ్మన్ కంటే కేఎల్ రాహుల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కుండబద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ వంటి పరిస్థితుల్లో గిల్ కంటే రాహుల్ మెరుగ్గా రాణించగలడని, అతని బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుందని పేర్కొన్నాడు.
Lakshmi Parvathy: చంద్రబాబుని రజనీకాంత్ ఎలా సపోర్ట్ చేస్తాడు?
మైకెల్ వాన్ మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్ అద్భుతమైన యంగ్ క్రికెటర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అతడు మంచి ఫామ్‌లోనూ ఉన్నాడు. అయితే.. ఇంగ్లండ్ వంటి పరిస్ధితుల్లో గిల్ కంటే రాహుల్ బాగా రాణించగలడు. రాహుల్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుంది. గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో నేను కొన్ని లోపాలను గమనించాను కాబట్టే.. గిల్ కంటే రాహుల్ బెటర్ అని భావిస్తున్నాను. పైగా.. ఇది కేవలం ఒకే ఒక్క మ్యాచ్. కొంచెం తేడా జరిగినా.. ఫలితాలు తారుమారు అవుతాయి. అందుకే.. పాత చరిత్రను పట్టించుకోకుండా, రాహల్‌కు అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఈ వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవాలంటే.. అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగడం ముఖ్యం’’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి.. మైకెల్ వాన్ అభిప్రాయాన్ని మన భారత జట్టు పరిగణనలోకి తీసుకుంటుందా?
Ustaad Bhagat Singh: ఓరీ మీ దుంపలు తెగ.. సడెన్ గా చూసి నిజమే అనుకున్నాం కదరా బాబు
నిజానికి.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ దారుణంగా నిరాశపరిచాడు. రెండు టెస్టుల్లోనూ అతడు పేలవ ప్రదర్శనలతో ఉసూరుమనిపించాడు. దీంతో, అతడ్ని ఆఖరి రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుంచి తప్పించారు. అయినప్పటికీ.. సెలక్టర్లు రాహుల్‌పై మరోసారి నమ్మకం ఉంచుతూ, డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో రాహుల్‌కు చోటు ఇచ్చారు. అతనితో పాటు శుబ్మన్ గిల్ కూడా జట్టులో ఉన్నాడు. ఈ క్రమంలోనే.. గిల్ కంటే కేఎల్ రాహుల్ ఉత్తమమైన ఆటగాడు అని, అతనికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వాన్ చెప్పుకొచ్చాడు.