China Chickens Case: ఇదెక్కడి ప్రతీకారంరా నాయనా.. 1100 కోళ్లను భయపెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese Man Gets 6 Months In Jail For Scaring 1100 Of His Neighbour Chickens To Death: పక్కింటి వ్యక్తిపై పగ పెంచుకున్న ఒక చైనా వ్యక్తి.. ఓ విచిత్రమైన పనితో ప్రతీకారం తీర్చుకున్నాడు. తన చెట్లను నరికేసినందుకు.. అతని కోళ్లను టార్చ్‌లైట్‌తో భయబ్రాంతకులకు గురి చేసి, వారి ప్రాణాలను బలిగొన్నాడు. ఒకసారి శిక్ష పడినా మారకుండా, మరోమారు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో.. కోర్టు అతనికి కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. చైనాలో జరిగిన ఈ వింత ఘటన వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఒక ప్రాంతంలో గూ, జాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. మొదట వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉండేది. ఎలాంటి గొడవలు ఉండేవి కావు.
Dubai Car Number Plate: కారు నెంబర్ కోసం రూ.122 కోట్లు ఖర్చు.. వేలంలో గిన్నిస్ రికార్డ్
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
అయితే.. గతేడాది ఏప్రిల్‌లో జాంగ్ చేసిన ఒక పని, వీరి మధ్య చిచ్చు రేగేలా చేసింది. గూ పర్మిషన్ తీసుకోకుండా, అతని చెట్లను జాంగ్ నరికేశాడు. ఇక అప్పటినుంచి జాంగ్‌పై గూ పగ పెంచుకున్నాడు. అతనిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చెట్లను నరికేశాడు కాబట్టి, అతనికి సంబంధించిన ఆస్తుల్ని కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అప్పుడే అతనికి ఒక బ్యాడ్ ఐడియా తట్టింది. జాంగ్ కోళ్ల ఫారమ్ నిర్వహిస్తున్నాడు కాబట్టి, అతని కోళ్లను చంపేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం.. గూ కొన్ని రోజుల క్రితం ఒక రాత్రి జాంగ్ కోళ్ల ఫారమ్ వద్దకు వెళ్లాడు. అక్కడికెళ్లి సడెన్‌గా ఫ్లాష్‌లైట్ ఆన్ చేశాడు. దాంతో భయబ్రాంతులకు గురైన ఆ కోళ్లు, ఒకేసారి మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి.. 500 కోళ్లు చనిపోయాయి.
Yash Dayal: యశ్ దయాల్ చెత్త రికార్డ్.. ఐపీఎల్‌లో రెండో బౌలర్‌గా..
ఈ ఘటనపై జాంగ్ ఫిర్యాదు చేయగా.. గూ నేరస్తుడని తేలింది. అప్పుడు అతనికి రూ.35,179 జరిమానాతో పాటు జైలుశిక్ష విధించారు. ఈ శిక్ష అనుభవించిన తర్వాత కూడా గూలో మార్పు రాలేదు. అతడు మరోసారి కోళ్ల ఫారమ్ వద్దకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఈసారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. గూని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. అతడు కావాలని ఈ పనికి పాల్పడ్డాడని, జాంగ్‌కు నష్టం కలిగించేలా చేశాడని కోర్టు నిర్ధారించింది. అతడ్ని దోషిగా తేల్చి, ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే.. జాంగ్‌కి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. గూ చేసిన పనికి జాంగ్‌కి చెందిన 1100 కోళ్లు మరణించగా, వాటి విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని తేలింది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!