Yash Dayal Creates Worst Record In IPL: గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ తన పేరిట ఒక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఏప్రిల్ 9వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 69 పరుగులిచ్చిన అతగాడు.. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో భాగంగా మొదటి మూడు ఓవర్లలో యశ్ దయాల్ 38 పరుగులే ఇచ్చాడు. కానీ.. చివరి ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు ధారాళంగా ఇచ్చేశాడు. అయితే.. అతనికంటే ముందుగా బాసిల్ థంపి 70 పరుగులిచ్చి అగ్రస్థానంలో ఉన్నాడు. 2018లో హైదరాబాద్ తరుపున ఆడిన థంపి.. బెంగుళూరుపై నాలుగు ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో ఇషాంత్ శర్మ(66), ముజీబ్ రెహ్మాన్ (66), ఉమేశ్ యాదవ్ (65) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా.. యశ్ దయాల్ ఈ సీజన్‌లో గుజరాత్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గత సీజన్‌లో మాత్రం 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు.
Ponguleti Srinivas Reddy: నన్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదం.. వందలసార్లు పలిచినా వెళ్లలేదు
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (39), సాయి సుదర్శన్ (53)లు మెరుగ్గా రాణించగా.. విజయ్ శంకర్ చివర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు. అందుకే.. గుజరాత్ 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. మొదటి నుంచే గట్టి పోటీనిచ్చింది. అఫ్‌కోర్స్.. మొదట్లో గుర్బాజ్, జగదీశన్ వెంటనే ఔటైనా.. ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (83), నితీశ్ రానా (45) విజృంభించారు. అయితే.. వీళ్లిద్దరు ఔటయ్యాక ఆశలు సన్నగిల్లాయి. చివర్లో 5 బంతులకు 28 పరుగులు చేయాలన్నప్పుడు.. ఇక గుజరాత్‌దే విజయమని దాదాపు ఫిక్సయ్యారు. అప్పుడు రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సులు కొట్టి, కేకేఆర్‌ని గెలిపించాడు. కనీవినీ ఎరుగని రీతిలో సిక్సుల వర్షం కురిపించి.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో.. అతడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్