Jofra Archer History: చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్.. ఈ అరుదైన డబుల్‌ను ఎవరూ సాధించలేదు!
- జోఫ్రా ఆర్చర్ అరుదైన చరిత్ర
- ఐపీఎల్ చరిత్రలోనే తొలి పేసర్
- అరుదైన డబుల్‌ను ఎవరూ సాధించలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jofra Archer Rare IPL Playoffs Record: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అరుదైన చరిత్ర సృష్టించాడు. న్యూ చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్చర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు ఘన విజయం అందించాడు. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులతో అందరి దృష్టిని ఆకర్షించగా.. మరోవైపు ఆర్చర్ బంతితో, ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు. దాంతో ఆర్చర్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అరుదైన రికార్డు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
243 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లలోనే షాక్ ఇచ్చాడు. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మను డకౌట్ చేసి గట్టి దెబ్బ కొట్టాడు. అనంతరం ఇషాన్ కిషన్ (33), ట్రావిస్ హెడ్ (17) వికెట్లు కూడా తీసి పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. మొత్తం మూడు కీలక వికెట్లు తీసిన ఆర్చర్.. ఫీల్డింగ్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు కూడా పట్టాడు. స్మరణ్ రవిచంద్రన్, ప్యాట్ కమిన్స్, ఈషాన్ మలింగ క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో మూడు వికెట్లు, మూడు క్యాచ్‌లు అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ప్లేఆఫ్స్‌లో మూడు వికెట్లు తీసి రెండు క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు ఉన్నా.. 3 వికెట్లు + 3 క్యాచ్‌ల అరుదైన డబుల్‌ను ఎవరూ సాధించలేదు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే.. ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా ఆర్చర్ నిలిచాడు. 2013లో డ్వేన్ బ్రావో సీఎస్కే తరఫున ఈ ఫీట్ సాధించగా.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కగిసో రబాడ నాలుగు వికెట్లు, మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఇప్పుడు ఆ జాబితాలో జోఫ్రా ఆర్చర్ కూడా చేరిపోయాడు. ఈ సీజన్లో ఆర్చర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో పోటీదారుడిగా నిలిచాడు. రాజస్థాన్ తరఫున రెండోసారి 20కి పైగా వికెట్లు తీసిన తొలి పేసర్‌గా కూడా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఆర్ఆర్ తరఫున ఒకటి కంటే ఎక్కువ 20+ వికెట్ల తీసిన జాబితాలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఐపీఎల్ 2026లో తొలి ఓవర్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కూడా ఆర్చర్ రేర్ రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటికే తొలి ఓవర్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డులో ట్రెంట్ బౌల్ట్ (8 వికెట్లు, 2020) మాత్రమే అతడి కంటే ముందున్నాడు. ఇప్పుడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఆ మ్యాచ్‌లో కూడా ఆర్చర్ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. రాజస్థాన్ ఫైనల్‌కు చేరనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!