Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithya Menen: ఇన్నాళ్లూ ఆ స్టార్ హీరోయిన్‌కు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని, జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకుందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె తన మనసులోని అసలు మాటను బయటపెట్టి అందరికీ షాకిచ్చింది. తనకూ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఓపెన్‌గా చెప్పేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. నేచురల్ బ్యూటీ నిత్యా మేన్. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, పెళ్లి ఆలోచనలపై నిత్యా చాలా క్లారిటీగా మాట్లాడారు.
గతంలో తాను పెళ్లి గురించి మాట్లాడిన మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. తాను పెళ్లికి వ్యతిరేకమని ఎప్పుడూ అనలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని, కాకపోతే ఎలాంటి వ్యక్తి జీవితంలోకి రావాలి, ఆ బంధం ఎలా ఉండాలి అనే విషయంలో తనకు పూర్తి స్పష్టత ఉందని తెలిపారు. కేవలం పెళ్లి అనే మాట కోసం కాకుండా, సరైన వ్యక్తితో ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకోవడమే తన ఉద్దేశమని ఆమె వివరించారు.
Also Read
- Arjun Kapoor : మలైకాతో బ్రేకప్ తర్వాత పదేళ్ల చిన్నదైన ఆ బ్యూటీతో అర్జున్ కపూర్ కొత్త లవ్ ట్రాక్?
- Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
- Sampath Nandi: ఆ ఒక్క కారణంతోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్నా..
- Mega Box Office Clash: 'కాకా' కర్చీఫ్ వేసిన చోటే 'విశ్వంభర' కన్ను.. సంక్రాంతి బరిలో మెగా క్లాష్?
ఇక తన స్వభావం గురించి మాట్లాడుతూ నిత్యా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బయట జనంలోకి వెళ్లడం, నలుగురి మధ్య కనిపించడం తనకు మొదటి నుంచీ అంతగా ఇష్టం ఉండదని చెప్పారు. చిన్నప్పుడు ఎవరైనా తన వైపు తదేకంగా చూస్తుంటే, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పేదాన్ని అంటూ నవ్వేశారు. తనకు సిగ్గు చాలా ఎక్కువని, పబ్లిక్‌లో ఉండటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే అలాంటి అసౌకర్యం ఎదురైనప్పుడే దానికి కారణమేంటో తనను తాను ప్రశ్నించుకుంటూ, ఆ సవాళ్ల నుంచే కొత్త విషయాలు నేర్చుకుంటానని నిత్యా తెలిపారు. ప్రస్తుతం నిత్యా మేనన్ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌తో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. మొత్తానికి పెళ్లి వార్తలపై నిత్యా మేనన్ ఇచ్చిన ఈ లేటెస్ట్ క్లారిటీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!
-
IPL Auction: ఐపీఎల్ 2027 వేలంలో బెన్ స్టోక్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హ్యారీ బ్రూక్‌పై వేటు.. కారణం ఇదే..
-
Tamil Nadu Government: TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Arjun Kapoor : మలైకాతో బ్రేకప్ తర్వాత పదేళ్ల చిన్నదైన ఆ బ్యూటీతో అర్జున్ కపూర్ కొత్త లవ్ ట్రాక్?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!