Tamil Nadu Government: TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Government: తమిళనాడులో అధికార TVK పార్టీకి చెందిన వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కురిచ్చి TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై వచ్చిన ఫిర్యాదుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టేందుకు నలుగురు సభ్యులతో కూడిన అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ కమిటీలో అదనపు ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో పాటు మరో సభ్యుడికి చోటు కల్పించారు. మొత్తం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై వచ్చిన ఫిర్యాదులోని అంశాలను ఈ కమిటీ విచారించనుంది. విచారణ అనంతరం తన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ఎమ్మెల్యేపై వచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు పోలీసులు. కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఇదే అంశంపై ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అన్నాడీఎంకేకు చెందిన న్యాయవాది ఆర్. తిరిసూలి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
- Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్..
- Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
- Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఆస్తుల విచారణపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రద్దు!
ఇక, ఈ పిటిషన్ నవంబర్ 23న జస్టిస్ లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మహిళా జిల్లా కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి పోలీసుల తరఫున హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన క్రిమినల్ న్యాయవాది ఆర్. జాన్ సత్యన్ స్పందిస్తూ.. సంబంధిత జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు అందలేదని కోర్టుకు వివరించారు. ఈ వ్యవహారంలో అసభ్యకర సందేశాలు పంపి ఉంటే అది దురదృష్టకరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరోసారి సంప్రదించి, ఈ అంశంపై వివరాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు. నవంబర్ 24న తదుపరి విచారణ సందర్భంగా పూర్తి వివరాలు తెలియజేయాలని సూచిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు.
ఈ పరిణామాల మధ్య నవంబర్ 23న సోమవారం మధ్యాహ్నం కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం వెలువడింది. ఎమ్మెల్యే తనతో అనుచితంగా ప్రవర్తించారని, అవసరం లేని సందేశాలు పంపించారని కలెక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు నవంబర్ 24న మరోసారి జస్టిస్ లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ.. అసభ్యకర సందేశాలు పంపినట్లు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కల్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది..
తాజావార్తలు
-
Tamil Nadu Government: TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Arjun Kapoor : మలైకాతో బ్రేకప్ తర్వాత పదేళ్ల చిన్నదైన ఆ బ్యూటీతో అర్జున్ కపూర్ కొత్త లవ్ ట్రాక్?
-
AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వానలు.. అలర్ట్ జారీ
-
Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
-
ICC Rankings: న్యూజిలాండ్‌పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!